ప్రజల అవసరాలు, పరిపాలనలో సౌలభ్యం కోసం మరికొన్ని మండలాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు పలు జిల్లాల్లో కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు కొత్త మండలాలకు సంబంధించిన ఉత్తర్వులను ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపారు. తెలంగాణలో నూతన మండలాలు ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జిల్లాల్లో నూతన మండలాలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయా జిల్లాల్లోని రెవిన్యూడివిజన్ల పరిధిలో ఏర్పాటయిన నూతన మండలాలు ఇలా వున్నాయి. నూతన మండలాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
కొత్త మండలాలు ఇవే..
1. గట్టుప్పల్(నల్లగొండ)
2. కౌకుంట(మహబూబ్‌నగర్)
3. ఆలూర్(నిజామాబాద్)
4. సాలూర(నిజామాబాద్)
5. డొంకేశ్వర్(నిజామాబాద్)
6. సీరోల్(మహబూబాబాద్)
7. నిజాంపేట్(సంగారెడ్డి)
8. డోంగ్లీ(కామారెడ్డి)
9. ఎండపల్లి(జగిత్యాల)
10. భీమారం(జగిత్యాల)
11. గుండుమల్(నారాయణపేట్)
12. కొత్తపల్లె(నారాయణపేట్)
13. దుడ్యాల్(వికారాబాద్)
Kesineni Nani : టీడీపీలో మళ్లీ షరా మామూలుగానే నాని తీరు.. ఎక్కడ గ్యాప్ వచ్చింది?
* నారాయణ పేట జిల్లా/ రెవిన్యూ డివిజన్ పరిధిలో..గుండుమల్ (gundumal) , కొత్తపల్లె(kothapalle) మండలాలు.
* వికారాబాద్ జిల్లాలోని, తాండూర్ రెవిన్యూ డివిజన్ పరిధిలో.. దుడ్యాల్ (dudyal) మండలం.
* మహబూబ్ నగర్ జిల్లా/రెవిన్యూ డివిజన్ పరిధిలో..కౌకుంట్ల (koukuntla) మండలం.
* నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ రెవిన్యూ డివిజన్ పరిథిలో..ఆలూర్ (aloor), డొంకేశ్వర్(donkeshwear) మండలాలు.
* నిజామాబాద్ జిల్లా, బోధన్ రెవిన్యూ డివిజన్ పరిథిలో,, సాలూర(saloora) మండలం.
* మహబూబాబాద్ జిల్లా/రెవిన్యూ డివిజన్ పరిథిలో..సీరోల్(seerole) మండలం.
* నల్లగొండ జిల్లా/రెవిన్యూ డివిజన్ పరిథిలో…గట్టుప్పల్(gattuppal) మండలం
* సంగారెడ్డి జిల్లా, నారాయణ్ ఖేడ్ రెవిన్యూ డివిజన్ పరిధిలో…నిజాం పేట్ (nizampet) మండలం.
* కామారెడ్డి జిల్లాలోని, బాన్స్ వాడ రెవిన్యూ డివిజన్ పరిథిలో.. డోంగ్లి (dongli) మండలం.
* జగిత్యాల జిల్లా/జగిత్యాల రెవిన్యూ డివిజన్ పరిథిలో.. ఎండపల్లి(endapally) మండలం., జగిత్యాల జిల్లా, కోరుట్ల డివిజన్ పరిథిలో, భీమారం(bheemaram) మండలం ఉంటాయి.
