NTV Telugu Site icon

సోలార్‌ ప్లాంట్‌ పేరుతో రూ.12 కోట్లు కొట్టేశారు..

కొత్త కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు.. ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలకుండా.. ఎవరూ ఊహించని తరహాలో కొత్త తరహాలో కుచ్చుటోపీ పెట్టేస్టున్నారు.. తాజాగా.. సోలార్ ప్లాంట్ పేరుతో ఏకంగా రూ. 12 కోట్లు మోసం చేసిన ఘటన వెలుగు చూసింది.. ఈ కేసులో కీలకసూత్రధారిని అరెస్ట్‌ చేశారు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ పోలీసులు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆమనగల్‌లో సోలార్ పవర్ ప్లాంట్ పెడతామని నమ్మించిన ఖుర్షీద్ అహ్మద్… సౌదీలో ఉన్న తన బంధువు అల్తాఫ్ ద్వారా పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేశాడు.. అల్తాఫ్ తన స్నేహితులకు ప్లాంట్ గురించి వివరించి అధిక లాభాలు వస్తాయని నమ్మించి వారి వద్ద నుండి మొదట రూ. 2 కోట్లు పెట్టుబడిగా పెట్టించాడు.. అయితే, రెండేళ్ల తర్వాత ప్లాంట్ గురించి.. రాబడుల కోసం నిలదీశారు సౌదీ స్నేహితులు…

ఇక, ప్రభుత్వం ద్వారా నకిలీ పర్చస్ అగ్రిమెంట్ వచ్చిందని నమ్మించిన అహ్మద్.. అనంతరం కొన్ని నెలలు పెట్టుబడులు పెట్టిన వారికి నెల నెల 3 లక్షల రూపాయల చొప్పున చెల్లించాడు.. లాభాలు వస్తున్నాయని నమ్మిన అల్తాఫ్ .. మరికొంత మంది ద్వారా మొత్తం 11 మంది నుండి 12 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టించాడు.. సౌదీ నుండి అల్తాఫ్ తెలంగాణ కు వచ్చి ప్లాంట్ చూడగా.. అక్కడ స్ట్రక్చర్ మాత్రమే ఉండడంతో.. ఖంగుతిన్నాడు.. వెంటనే సౌదీలో ఉన్న స్నేహితులకు విషయం చెప్పాడు.. కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన సౌదీ వారంతా..( ఖాజా మహబూబ్ అలీ ఖాన్ అనే వ్యక్తి ) ఆన్‌లైన్‌ ద్వారా అల్తాఫ్ పై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు.. అల్తాఫ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.. ఇక, కీలక నిందితుడు ఖుర్షీద్ అహ్మద్ పరారీలో ఉన్నాడు.