NTV Telugu Site icon

Warangal: రెండు రోజుల్లోనే 10 చోరీలు.. 8 స్పెషల్‌‌‌‌ టీమ్స్‌‌‌‌ ఏర్పాటు చేసిన ఆఫీసర్లు

Thif In Warangala

Thif In Warangala

Warangal: గ్రేటర్ వరంగల్ లో దొంగలు రెచ్చిపోతున్నాయి. ప్రత్యేక పరికరాలు ఉపయోగించి డోర్ హ్యాండిళ్లు, తాళాలు పగులగొట్టి అందినకాడికి దోచుకుంటున్నారు. గత రెండు రోజులుగా గ్రేటర్ పరిధిలో 10 దొంగతనాలు జరగడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై స్పందించిన సీపీ రంగనాథ్ దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే కమిషనరేట్ పరిధిలో రోజురోజుకు దొంగతనాలు పెరిగిపోతుంటే.. వాటిని నియంత్రించడంలో పోలీసులు వెనుకడుగు వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరంగల్, కాజీపేట స్టేషన్ల మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు రైలు కనెక్టివిటీ ఉండడంతో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి దోపిడీ ముఠాలు తరచూ గ్రేటర్‌ను టార్గెట్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ ముఠాలు అపార్ట్ మెంట్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. గతంలో కాజీపేట పీఎస్ పరిధిలోని పీజీఆర్ అపార్ట్‌మెంట్‌లోని మూడు ఫ్లాట్లలో సుమారు 40 తులాల బంగారం, రూ.22 లక్షలు చోరీకి గురయ్యాయి. ఇద్దరు ఏసీపీలు, ముగ్గురు సీఐలు, ఇద్దరు ఎస్సైలు ఉన్న అపార్ట్‌మెంట్‌లో చోరీ జరగడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ప్రస్తుతం జరుగుతున్న చోరీలను కూడా మధ్యప్రదేశ్ ముఠాలే చేస్తున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Read also: Shahrukh Jawan: వంద కోట్ల ఓపెనింగ్… వెయ్యి కోట్ల కలెక్షన్స్…

దొంగతనానికి వచ్చే వారు కేవలం 5 నుంచి 10 నిమిషాల్లోనే పనులు పూర్తి చేయడం గమనార్హం. మంగళవారం చోరీలు జరిగిన ప్రాంతంలోని సీసీటీవీలో మధ్యప్రదేశ్ రిజిస్ట్రేషన్ ఉన్న కారు కనిపించడంతో దుండగులు అదే కారులో వచ్చి చోరీలకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. తాళాలు సైలెంట్ గా కోసేందుకు దుండగులు ప్రత్యేక సామగ్రిని ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు చోరీలు చేసి తప్పించుకుంటున్నారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో సోదాలు నిర్వహిస్తున్నాం. వరంగల్ లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ చోరీలకు పాల్పడినట్లు సమాచారం. త్వరలోనే పట్టుకుంటామని వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ తెలిపారు. వరంగల్ లోని గాయత్రి, వాదిరాజు అపార్ట్ మెంట్లలో రెండు, హనుమకొండ పీఎస్ పరిధిలోని లహరి, కల్లెడ, మారుతీ వాసవీ నిలయం అపార్ట్ మెంట్లలో ఐదు చోరీలు జరిగి మొత్తం 155 తులాలకు పైగా బంగారం పోయింది.

Read also: Bhola Shankar : ఓటీటీ లో విడుదల కాబోతున్న భోళా శంకర్.. ఎప్పటి నుంచి అంటే..?

వరంగల్ పుప్పాలగుట్టలోని ముత్యాలమ్మ ఆలయంలో బుధవారం మూడు ఇళ్లలో చోరీ జరిగింది. దీంతో వరంగల్ సీపీ రంగనాథ్ నగర పరిధిలోని పోలీసులను అప్రమత్తం చేశారు. వరుస దొంగల ముఠాను పట్టుకునేందుకు ప్రత్యేకంగా ఎనిమిది బృందాలను ఏర్పాటు చేశారు. బుధవారం సాయంత్రం నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సమాచారం. వారి నుంచి పూర్తి సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది. కమిషనరేట్ పరిధిలో 53 పీఎస్‌లు ఉండగా, గ్రేటర్ పరిధిలో 11 స్టేషన్లు ఉన్నాయి. సీపీ, తూర్పు, సెంట్రల్ జోన్ డీసీపీ, వరంగల్, హనుమకొండ, కాజీపేట ఏసీపీ, సీసీఎస్, టాస్క్ ఫోర్స్ ఇలా రకరకాల పోలీసు బలగాలతో నగరంలో జరుగుతున్న వరుస దొంగతనాలు ప్రజలకు, పోలీసులకు ఇబ్బందిగా మారుతున్నాయి. మొన్నటి వరకు కార్ల చోరీలతో బెంబేలెత్తిన గ్రేటర్ ప్రజలు.. ఇప్పుడు ఇళ్లలో దొంగతనాలతో ఆందోళన చెందుతున్నారు. ఇదిలావుంటే చోరీ కేసులను ఛేదించడంలో పోలీసులు వెనుకడుగు వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కమిషనరేట్ పరిధిలో చోరీ కేసుల పరిష్కారం 50 శాతం లోపే ఉందంటే అర్థం చేసుకోవచ్చు.

Read also: ‘Bharat’ controversy: “భారత్‌”గా పేరు మార్పుపై స్పందించిన ఐక్యరాజ్యసమితి