Site icon NTV Telugu

High Court: ప్రమాణం చేసిన 10 మంది కొత్త న్యాయమూర్తులు

తెలంగాణ హైకోర్టుకు నియ‌మి‌తు‌లైన పది మంది కొత్త న్యాయ‌మూ‌ర్తుల ప్రమాణస్వీకారం పూర్తి అయ్యింది.. హైకోర్టు హాల్‌లో 10 మంది నూతన జడ్జీలతో ప్రమాణస్వీకారం చేయించారు హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మ.. దీంతో హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరింది.. ప్రస్తుతం 19 మంది జడ్జీలు సేవలు అందిస్తుండగా.. వారికి కొత్త న్యాయమూర్తులు 10 మంది అదనంగా వచ్చిచేరారు.. నూతన న్యాయమూర్తులుగా కాసోజు సురేందర్, సూరేపల్లి నందా, ముమ్మినేని సుధీర్ కుమార్, కుచాడి శ్రీదేవి, ఎన్. శ్రవణ్ కుమార్ వెంకట్, గుణ్ణు అనుపమ చక్రవర్తి, గిరిజ ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, ఎ. సంతోష్ రెడ్డి, దేవరాజ్ నాగార్జునతో ప్రమాణం చేయించారు హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్‌ శర్మ..

Exit mobile version