Site icon NTV Telugu

Vijayashanthi: కేసీఆర్ గెలిస్తే తెలంగాణ బతుకు నాశనం అవుతుంది..

Vijayashanthi

Vijayashanthi

కేసీఆర్‌ను గెలిపిస్తే తెలంగాణ బతుకు నాశనం అవుతుందని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. బుధవారం ఆమె జోగులాంబ గద్వాల్ జిల్లా అలాంపూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ బహిరంగ సభలో విజయశాంతి మాట్లాడుతూ.. తెలంగాణలో అభివృద్ధి ఎక్కడ జరగలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఈ పదేళ్లు యువత, నిరుద్యోగులను మోసం చేసిందని ధ్వజమెత్తారు. పదేళ్లు యావత్ తెలంగాణ ప్రజలపై దండయాత్ర చేసి నిరుపేదల భూములను లాకున్నారని వాపోయారు. ప్రాజెక్టులు, ధరణి పోర్టల్, గ్రానైట్ బిజినెస్, డ్రగ్స్, మందు, గంజాయి సరఫరాతో ప్రజలపై దండయాత్ర చేసి దోపిడీ చేశారని విజయశాంతి పేర్కొన్నారు.

Also Read: Mallikarjun Kharge: అహంకార సీఎం కేసీఆర్‌ను గద్దె దించాలి..

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్లు తిన్నారని విమర్శించారు. కేసీఆర్ అవినీతే ఆయన ప్రభుత్వాన్ని కూలదోస్తుందన్నారు. తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్‌పై దండయాత్ర చేయడానికి సిద్ధంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనన్నారు. 420 గాళ్లతో బీజేపీ చేతులు కలిపిందని విమర్శించారు. కేంద్రంలో బీజేపీని… రాష్ట్రంలో కేసీఆర్‌ను ఓడించాలన్నారు. కాంగ్రెస్ గెలిస్తే యావత్ తెలంగాణ గెలిచినట్టేనని రాములమ్మ అన్నారు. కాంగ్రెస్‌ను గెలిపించి దోపిడికి చరమగీతం పాడాలన్నారు. దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను మీకు అందిస్తుందని… మీరు మాత్రం కేవలం ఓటు వేసి మీ గ్యారెంటీని చాటుకోవాలని విజయశాంతి పేర్కొన్నారు.

Also Read: Kishan Reddy: దమ్ముంటే మెడికల్ కాలేజీలకు రాసిన ఉత్తరాలు బయటపెట్టు.. కేసీఆర్‌కు సవాల్

Exit mobile version