NTV Telugu Site icon

Priyanka Gandhi: బీఆర్ఎస్ ను తప్పించండి.. కాంగ్రెస్ ను తీసుకుని రండి.. ఉద్యోగాలు పొందండి..

Priyanka

Priyanka

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పర్యటిస్తున్నారు. పాలేరులో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా ఆమె రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రియాకం గాంధీ మాట్లాడుతూ.. కేసీఆర్ ఫ్యామిలీకి ఉద్యాగాలు వచ్చాయి.. తెరాస్ ను తప్పించండి.. కాంగ్రెస్ ను తీసుకుని రండి.. ఉద్యోగాలు పొందండి అని ఆమె తెలిపారు. ఈ రాష్ట్రం మిశ్రమంతో ఏర్పడింది.. తెలంగాణ రైతులు, ఆడబిడ్డలు, యువత కొట్లాడితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని చెప్పుకొచ్చారు. ఉద్యమాలు చేసి తెచ్చుకున్న రాష్ట్రంలో తమ కల నిజం కాలేదు.. పదేళ్లుగా బీఆర్ఎస్ ఈ రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించింది అని ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు.

Read Also: Harish Rao: రిస్క్ వద్దు.. కారుకు ఓటు గుద్దు..

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చోటు ఉద్యోగాలు సంపద పంచాము అని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. అందరికీ ఇల్లు వచ్చే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి.. యువత అందరికీ ఉద్యోగులు వచ్చే ప్రభుత్వం కావాలి.. రైతాంగ రుణం మాఫీ చేసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం.. శక్తివంతమైన మీ అందరి కోసం పని చేసే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. మార్పు కావాలి కాంగ్రెస్ కావాలి అంటూ తెలుగులో ప్రియాంక గాంధీ నినాదాలు చేసింది.
Priyanka Gandhi Speech at Khammam Road Show  | NTV