NTV Telugu Site icon

Ponguleti Srinivas Reddy: ఈ ఎన్నికలు దోపిడి రాజ్యానికి ఇందిరమ్మ రాజ్యానికి మధ్య జరుగుతున్న యుద్ధం

Ponguleti

Ponguleti

పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో ప్రియాంక గాందీ సభలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు దోపిడి రాజ్యానికి ఇందిరమ్మ రాజ్యానికి మధ్య జరుగుతున్న యుద్ధం అంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్ గెలుపును మోడీ ఆపాలేరు కేసీఆర్ ఆపలేరు అని ఆయన అన్నారు. మోడీ, కేసీఆర్ ఇద్దరి బంధం ఫెవికల్ బంధం.. ఉమ్మడి వరంగల్ జిల్లా 10 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుంది.. ఖమ్మం జిల్లా 10కి 10 స్థానాలు కాంగ్రెస్ కూటమి గెలుస్తుంది.. ఎర్రబెల్లి దయాకర్ రావు డబ్బును నమ్మకొని రాజకీయం చేస్తున్నాడు అంటూ కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Read Also: Fly: కొలొనోస్కోపీ చేయించుకున్న వృద్ధుడు.. పెద్ద పేగును చూసి డాక్టర్లు షాక్.. ఎందుకంటే..!

యశస్వినీ రెడ్డి మాత్రం ప్రజలను నమ్ముకొని రాజకీయాల్లోకి వచ్చారు అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సోనియా గాంధీ ప్రకటించి ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో అమలు చేస్తుంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మూడు సార్లు ఎర్రబెల్లి దయాకర్ రావు మాయ మాటలు చెబితే ఓట్లేశారు.. కానీ, నాలుగో సామా మాత్రం దయాకర్ రావు చెప్పే మాయ మాటలను జనం నమ్మడం లేదు.. దయాకర్ రావుకి తగిన బుద్ది చెప్పబోతున్నారు అంటూ ఆయన పేర్కొన్నారు.