NTV Telugu Site icon

PM Modi: మహాసభ వేదికపై కంటతడి పెట్టిన మందకృష్ణ.. ఓదార్చిన ప్రధాని మోడీ

Modi

Modi

PM Modi: సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో మాదిగల విశ్వరూప మహాసభ జరుగుతోంది. విశ్వరూప మహాసభకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎమ్మార్పీఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. ప్రధాని రాక నేపథ్యంలో ఎమ్మార్పీఎస్ శ్రేణుల నినాదాలు మారుమ్రోగాయి. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌ చేరుకున్న ప్రధాని మోడీకి ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి(ఎమార్పీఎస్‌) అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను ప్రధాని మోడీ ఆలింగనం చేసుకున్న చేసుకున్నారు. మందకృష్ణ మాదిగ భుజం తట్టారు ప్రధాని మోడీ. ఈ క్రమంలో మందకృష్ట మాదిగ భావోద్వేగంతో కంటతడి పెట్టుకుని ఎమోషనల్ అయ్యారు. ప్రధాని మోడీ మందకృష్ణ వీపుపై తడుతూ ఓదార్చారు. ఈ వేదిక నుంచి ప్రధాని మోడీ ఎస్సీ వర్గీకరణ గురించి ప్రకటన చేస్తారని పలు వర్గాలు పేర్కొన్నాయి.

Also Read: Supreme Court: ‘నేను బతికే ఉన్నా యువర్ హానర్’.. తన హత్య కేసు విచారణలో ప్రత్యక్షమైన బాలుడు..

ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ ప్రసంగించారు. “మమ్మల్ని ఈ సమాజం మనుషులుగా చూడలేదు. మమల్ని పశువులకంటే హీనంగా చూశారు. మాకు ధైర్యం చెప్పడానికి వచ్చిన మోడీకి ధన్యవాదాలు. మేము ఊహించని కల ఇది. సామాజిక న్యాయంపై బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మాటలు మాత్రమే చెబుతున్నాయి. మా ఆకాంక్షలు నెరవేర్చేది బీజేపీనే. బలహీన వర్గాలకు అండగా ఉండే పార్టీ బీజేపీనే. తెలంగాణకు బీసీని సీఎంగా చేస్తామని చెప్పింది ఒక్క బీజేపీనే. మోడీకి సామాజిక స్పృహ ఉంది కాబట్టే మా సభకు వచ్చారు. ” అని మందకృష్ణ మాదిగ అన్నారు.

 

Show comments