NTV Telugu Site icon

KTR: ఏడ్వాలంటే కాంగ్రెస్‌కు.. నవ్వాలంటే బీఆర్ఎస్‌కు ఓటేయండి

Ktr

Ktr

Minister KTR Comments: మీరు ఏడ్వాలంటే కాంగ్రెస్‌కు.. నవ్వాలంటే బీఆర్ఎస్‌కు ఓటేయాలని ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. సోమవారం కొప్పుల ఈశ్వర్‌కు మద్దతుగా ధర్మపురిలో కేటీఆర్ ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా వెల్గటూర్‌ నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ నాయకులు ఎలక్షన్ కమిషన్‌తో మాట్లాడి మరోసారి రైతు బంధును నిలిపివేశారు. రైతులు ఆందోళన పడొద్దు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల ఖాతాలో డబ్బులు జమచేస్తం. 30న కారు గుర్తుకు ఓటేసి కొప్పుల ఈశ్వర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలి.

Also Read: Karnataka: లక్ష అప్పు.. ముగ్గురు పిల్లలతో సహా భార్యభర్తల ఆత్మహత్య.. రెండు పేజీల సూసైడ్ నోట్

కరెంట్ కావాలో.. కాంగ్రెస్ కావాలో ప్రజలు తేల్చుకోవాలి. కాంగ్రెస్ నాయకులు 3 గంటల కరెంట్ చాలని అంటున్నారు. 24 గంటల కరెంట్ గురించి..మాట్లాడే అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదు. కాంగ్రెస్ హయాంలో కరెంట్ లేక ఎంత ఇబ్బంది పడ్డమో..రైతులు గుర్తుకు తెచ్చుకోవాలి. 24 గంటల కరెంట్ ఇస్తుంది తెలంగాణ రాష్ట్రం ఒక్కటే. దేశంలో 16 రాష్ట్రాల్లో ఎక్కడలేని విధంగా పీఎఫ్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. గులుగుడు గులుగుడే.. గుద్దుడు గుద్దుడే. ధరణీ రద్దు చేస్తామని భట్టి విక్రమార్క.. రెడ్డి రైతు బంధు దుబారా ఉత్తమ్ కుమార్ అనడం సిగ్గుచేటు.

Also Read: Delhi: విషాదం.. గుండెపోటుతో ఆరేళ్ల చిన్నారి మృతి

కాంగ్రెస్‌కు ఓటేస్తే.. తెలంగాణ రాష్ట్రం చచ్చి పొద్ది. పది రోజుల్లో వచ్చేది.. బీఅర్ఎస్. స్తంభంపల్లి వద్ద ఇథనాల్ ప్రాజెక్ట్ రద్దు చేసి, వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేస్తాం. కేసిఆర్ పాలనే ప్రజలకుశ్రీరామ రక్ష. అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్మపురి నియోజక వర్గంలో దళిత బంధు పథకం ఇంటింటా ఇస్తం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఆకలి చావులే. మీరు ఏడ్వాలి అంటే కాంగ్రెస్ కు ఓటు వేయండి నవ్వాలి అంటే బీఆర్ఎస్‌కు ఓటు వేయండి. గాడుదులకు గడ్డి వేసి అవులకు పాలు పిండితే రావు. మైనార్టీల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు.