Andela Sriramulu: మహేశ్వరం నియోజకవర్గం వ్యాప్తంగా జరిగిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్. ఈ సందర్భంగా ఓవైసీ అసదుద్దీన్, బీఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డిపై బహిరంగ సభలో నిప్పులు చెరిగారు. కేసీఆర్ కారు గుర్తుకు ఓటు వేసి మంత్రి సబితమ్మను గెలిపించాలని చెప్పారని.. గుర్తుచేశారు. ఐదేళ్లుగా దాచి ఉంచిన బీఆర్ఎస్, ఎంఐఎం అనుబంధం బయట పడిందని శ్రీరాములు యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Telangana BJP: చివరి రోజు తెలంగాణలో బీజేపీ జాతీయ నేతల ప్రచారం.. ఎవరెవరు ఎక్కడంటే..
ఈనెల 30న జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గుర్తు కమలం పువ్వుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు అందెల శ్రీరాములు యాదవ్. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు. అనంతరం కందుకూరు, బడంగ్ పేట, మీర్పేట్ కార్పొరేషన్లల్లో జరిగిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.