రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజక వర్గంలోని బడంగ్ పెట్ కార్పోరేషన్ పరిధిలో మహేశ్వరం నియోజక వర్గం బీఎస్పీ అభ్యర్ధి కొత్త మనోహర్ రెడ్డి ఆయన సతీమణి కొత్త సరితా రెడ్డి గడప గడపకు తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన భర్త కొత్త మనోహర్ రెడ్డిని ఓటు వేసి గెలిపించాలని మహిళలను కోరారు. ప్రచారంలో భాగంగా మహిళల సమస్యలను అడిగి తెలుసుకున్న కొత్త సరితా రెడ్డి.. వారి సమస్యలను కొత్త మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చి వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు.
Read Also: atrocious: మెదక్ లో దారుణం.. నీటిలో మునిగి అన్నదమ్ములు మృతి
ఇవాళ సాయంత్రం 3 గంటలకు మహేశ్వరం ముద్దుబిడ్డ, బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త మనోహర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా కందుకూరు గ్రామం నుంచి ప్రారంభమై దాసర్ల పల్లి, దాసర్ల పల్లి తండా, మాణ్యగూడ, నేదునూరు, బాచుపల్లి, పులిమామిడి, దన్నారం, చిప్పలపల్లి, మురళి నగర్, జైత్యారం, కొత్తగూడెం వరకు కొనసాగుతుంది.
Read Also: MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత.. ఎన్నికల ప్రచారంలో ఘటన
ఈ సందర్భంగా కొత్త మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. మహేశ్వరం నియోజకవర్గం కబ్జాదారుల చేతుల్లో ఉందని ఆరోపించారు. బీఎస్పీకి ఓటు వేసి వారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా సబితా ఇంద్రారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిలు వలస పక్షులుగా వస్తున్నారు.. వారిని నమ్మొద్దని ఆయన కోరారు. బీఎస్పీ అన్నీ వర్గాలకు సముచిత స్థానం కల్పించే పార్టీ అని తెలిపారు. మా పార్టీని ఆదరించాలని కొత్త మనోహర్ రెడ్డి కోరారు. ప్రజలకు అనేక సేవ కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. 3 వేల మందికి 60 గజాల స్థలాలను అందించామని కొత్త మనోహర్ రెడ్డి చెప్పుకొచ్చారు.