నిర్మల్ జిల్లా: రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కళ్లు నెత్తికి ఎక్కాయన్నారు బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. శుక్రవారం ఆయన నిర్మల్ జిల్లా ముదోల్‌లో పర్యటించిన ఆయన అక్కడ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో భైంసాలో ఎగిరేది కాషాయ జెండానే అన్నారు. ముదోల్ అంటేనే చదువుల తల్లి సరస్వతి దేవికి నిలయమని, తాము అధికారంలోకి వస్తే అభివృద్ది చేస్తామని హామి ఇచ్చారు.
Also Read: DK Shivakumar: కేసీఆర్, కేటీఆర్‌లను ఓడించి పర్మినెంట్‌గా ఫాంహౌజ్‌కి పంపండి
కేసీఆర్ గజకర్ణ గోకర్ణ టక్కు టమారా విద్యలు బందుజేయి.. నీ చీటి చెల్లిపోయిందంటూ ఫైర్ అయ్యారు. కేసీఅర్ గ్రామ గ్రామాన బెల్ట్ షాపులు పెట్టడంలో నంబర్ వన్ అని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇచ్చే పైసలు తీసుకోని.. ఓటు బీజేపీ వేయండిని ఈటెల పిలుపునిచ్చారు. పైసా దేనా.. ఓట్ లేనా.. ఇది కేసీఆర్ నైజమని, అక్కడ ఆయనో చక్రవర్తి.. ఇక్కడి ఎమ్మెల్యే ఓ నిజాం చక్రవర్తి అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
Also Read: Meetha Raghunath: అబ్బాయిల గుండె పగిలే న్యూస్.. నేటితరం డ్రీం గర్ల్ కి పెళ్ళయిపోతోంది!
పేదొల్ల ముఖ్య మంత్రిని అన్న కేసీఆర్.. డబల్ బెడ్ రూం ఇండ్లు యాడపోయినయ్ అని ప్రశ్నించారు. నమ్మకానికి మారు పేరు నరేంద్ర మోదీ అని, అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఅర్ పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే క్వింటాల్‌కు 3100 రూపాయల మద్దతు ధర ఇస్తమని, డిసెంబర్ 4 నుంచి అమలు చేస్తామన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఎరువుల సబ్సిడీ తొమ్మిది వేల రూపాయలు ఇస్తామని, ఏ జబ్బులకైనా పది లక్షల ఉచిత వైద్యాన్ని కల్పిస్తామన్నారు. అలాగే డ్రీప్.. డ్రిల్.. సబ్సీడీ ట్రాక్టర్‌లు ఇస్తామని ఈటెల తెలిపారు.