Site icon NTV Telugu

KCR Tour: నేడు నాలుగు నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం..

Cm Kcr Narsapoor

Cm Kcr Narsapoor

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మరో ఒక్క రోజు సమయం ఉంది. దీంతో ప్రధాన పార్టీలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇందులో అధికార బీఆర్ఎస్ పార్టీ ఇంకాస్త ముందంజలో ఉంది. ఇక, గులాబీ బాస్, సీఎం కేసీఆర్ రోజుకు నాలుగు నియోజకవర్గాల చొప్పు సుడిగాలి పర్యటనలు చేస్తున్నాండటంతో ప్రతిపక్ష పార్టీలు సైతం తమ పార్టీ అగ్రనేతలను రంగంలోకి దించి ప్రచారం చేయిస్తున్నాయి. అలాగే, నేడు సీఎం కేసీఆర్ నాలుగు నియోజకవర్గాల్లో జరుగనున్న ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. ఆయన ఇప్పటి వరకు 90 బహిరంగ సభల్లో పాల్గొన్నారు.

Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

అయితే, సీఎం కేసీఆర్ అక్టోబర్ 15న హుస్నాబాద్ నుంచి ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలకు శ్రీకారం చుట్టారు. ఇక, నేడు షాద్‌నగర్‌, చేవెళ్ల, ఆందోల్, సంగారెడ్డి నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దుతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. ఇవాళ్టి మీటింగ్ తో గులాబీ బాస్ పాల్గొన్న సభల సంఖ్య 94కు చేరుకోబోతుంది. రేపు మరో రెండు సభల్లో ఆయన పాల్గొంటారు. వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు ఉమ్మడిగా జరగనున్న సభతో పాటు గజ్వేల్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.

Exit mobile version