Site icon NTV Telugu

Congress Leading: అధిక స్థానాల్లో ముందంజలో కాంగ్రెస్

Majority Congress Leading

Majority Congress Leading

Congress Leading in Telangana Elections Counting: తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆసక్తికరంగా సాగుతోంది ఈ ఉదయం 8 గంటలకు మొదలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతోంది ముందుగా పోస్టల్ బ్యాలెట్ లను లెక్కించారు తర్వాత ఎనిమిదిన్నర గంటల నుంచి మొదటి రౌండ్ లెక్కింపు మొదలుపెట్టారు అధికారులు అయితే ఈ లెక్కింపులో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ముందంజలో ఉందని సమాచారం అందుతుంది దాదాపుగా అన్ని జిల్లాలలోనూ కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపిస్తోంది మొదటి రౌండ్ లోనే కాంగ్రెస్కు ఈ స్థాయిలో ముందంజ కనిపిస్తూ ఉండడంతో ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఇప్పటిదాకా ఉన్న సమాచారం మేరకు బాల్కొండ , ఆర్మూర్ , నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ లీడ్, బోధన్ కాంగ్రెస్ లీడ్, నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ లీడ్ తో దూసుకుపోతోంది. కొడంగల్ లో రెండో రౌండ్ పూర్తయ్యే సరికి 2513 ఓట్లతో రేవంత్ ముందంజలో ఉన్నారు. ధర్మపురిలో కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ మొదట రౌండ్ లో 431 ఓట్ల తో లీడ్ లో ఉన్నారు. కరీంనగర్ మానకొండూర్ నియోజక వర్గం మొదటి రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కవ్వoపెల్లి సత్యనారాయణ 1,005 లీడ్ లో ఉన్నారు. ఇక ధర్మపురి మొదటి రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్షణ్ 400 లీడ్ లో ఉన్నారు. కామారెడ్డిలో రెండో రౌండ్ లోనూ కాంగ్రెస్ ముందంజలో ఉంది. మక్తల్ అసెంబ్లీ స్థానానికి తొలి రౌండులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాకిటి శ్రీహరి 413 ఓట్ల మెజార్టీ సాధించారు. నల్గొండ మునుగోడు పోస్టల్ బ్యాలెట్ లో రాజ్ గోపాల్ రెడ్డి ముందంజలో ఉండగా వరంగల్ తూర్పు నియోజకవర్గం పోస్టల్ బ్యాలెట్ లలో కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ ముందంజ ఉన్నారు. ఇక ములుగు పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క ముందంజలో ఉండగా ఇబ్రహీంపట్నం మొదటి రెండు లో కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి 1383 ఓట్లతో ముందంజలో ఉన్నారు.

Telangana Elections Counting NTV Live Updates: ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్.. లైవ్ అప్‌డేట్స్‌

కల్వకుర్తిలో రెండు రౌండ్లకి గాను కాంగ్రెస్‌ ముందంజలో ఉంది. ఖమ్మంలో పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ అభ్యర్ధి తుమ్మల ముందంజలో ఉండగా మధిరలో పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ అభ్యర్ధి భట్టి విక్రమార్క ముందంజలో ఉన్నారు. పాలేరు లో పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ధర్మపురిలో పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ లీడ్ లో ఉంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజక వర్గాల్లోనూ పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ ముందంజలో ఉండగా నల్గొండ నియోజకవర్గంలో మొదటి రౌండ్ పూర్తి అయ్యేప్పటికీ 9000 ఓట్ల ఆదిత్యంలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. ఇక హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందంజలో ఉండగా మొదటి రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి 2వేల పై చిలుకు ఆధిక్యంలో ఉన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం మొదటి రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ముందంజలి ఉండగా కాంగ్రెస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు కూడా ఆధిక్యంలో ఉన్నారు. కొల్లాపూర్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు మొదటి రౌండ్ లో 1300 ఓట్ల మెజారిటీతో ఉండగా మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2 వేలకు పైగా లీడ్ లో ఉన్నారు. ఆలేరు అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి రౌండ్లో 720 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి బీర్లు ఐలయ్యదేవరకద్ర మొదటి రౌండ్ లో కాంగ్రెస్ 150 ఓట్ల ముందంజ కాగా మొదటి రౌండ్ ముగిసే సరికి జగిత్యాల లో మొదటి రౌండ్ లో 1000 ఆధిక్యం లో కాంగ్రెస్ అభ్యర్ధి జీవన్ రెడ్డి ఉన్నారు. ఇక నాంపల్లి నియోజక వర్గంలో ఫిరోజ్ ఖాన్ ముందజలో ఉండగా మధిరలో భట్టి విక్రమార్క 2098 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. తుంగతుర్తి మొదటి రౌండ్ ఫలితాలు విడుదల కాగా మొదటి రౌండ్ లో 3600 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి మందుల సామేల్ ఉన్నారు.

సిరిసిల్ల లో కేటీఆర్ ముందంజలో ఉండగా ఖైరతాబాద్ మొదటి రౌండ్ లో 471 ఓట్ల ముందంజలో brs అభ్యర్థి దానం నాగేందర్ ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గం మొదటి రౌండులో 126 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి వీరయ్య ఉండగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో మొదటి రౌండ్లో కాంగ్రెస్ పై బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ 8 వందల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ముషీరాబాద్ మొదటి రౌండ్ పూర్తి లీడింగ్ లో ఉన్న టీఆర్ఎస్ పార్టీ తాండూరులో కూడా జోరు చూపిస్తోంది. ఇక జుక్కల్ నియోజక వర్గంలో బీఆరెస్ ఆధిక్యం కనిపిస్తోండగాస్టేషన్ ఘనపూర్ లో మొదటి రౌండ్ లో BRS అభ్యర్థి కడియం శ్రీహరి 807 ఆధిక్యంతో ఉన్నారు.

Exit mobile version