NTV Telugu Site icon

G Niranjan: రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఉందా? అనే అనుమానం కలుగుతోంది.. కాంగ్రెస్ నేత

G Niranjan

G Niranjan

దీక్ష దీవాస్ పేరుతో బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించి ఎన్నికల కోడ్ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేత సీఈఓకు ఫీర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిన్న కేటీఆర్ దీక్ష దివాస్ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునివ్వడం ఎన్నికల కోడ్ ఉల్లంఘించడమే.. అందుకే సీఈఓకి ఫిర్యాదు చేశామన్నారు. ‘రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఉందా? అనే అనుమానం కలుగుతోంది. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి సైలెన్స్ పిరియాడ్ కొనసాగుతోంది. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ప్రచారం చేయొద్దని సీఈఓ తెలిపారు.

నిన్న కేటీఆర్ దీక్ష దివాస్ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునివ్వడం ఎన్నికల కోడ్ ఉల్లంఘనే. దీక్ష దివాస్ కార్యక్రమాలను కొన్ని ఛానెల్స్ ప్రసారం ఎలా చేస్తారు? పోలీసుల సమక్షంలోనే తెలంగాణ భవన్ లో దీక్ష దివాస్ నిర్వహించడం చూస్తే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఈసీ ఆధీనంలో ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మీ ఫ్లయింగ్ స్కాడ్స్, మైక్రో పరిశీలకులు ఏం అయ్యారు?అంబర్ పేటలో బీఆర్ఎస్ డబ్బులు విచ్చల విడిగా పంపిణీ చేస్తున్నా ఎన్నికల కమిషన్ పట్టించుకోవడం లేదు’ నిరంజన్ ఆరోపించారు.

Also Read: Telangana Rain Alert: ఎలక్షన్ పోలింగ్ డేకు వరుణ గండం.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

అలాగే మల్లు రవి మాట్లాడుతూ.. ఇవాళ, రేపు ఓటర్లకు డబ్బులు, మద్యం పంపిణీ చేసేందుకు బీఆర్ఎస్ ఏర్పాట్లు చేస్తోందన్నారు. దీక్ష దీవాస్‌ పేరుతో బీఆర్ఎస్ ప్రగతి భవన్ రక్తాదాన కార్యక్రమాలు నిర్వహించిన ఎన్నికల నిబంధనలను అతిక్రమించిందన్నారు. ‘తెలంగాణ ఓటర్లను ఏపీ బార్డర్ల వద్ద నిలిపివేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వ సూచన మేరకే ఆంధ్ర ప్రాంతం పోలీసులు తెలంగాణ ఓటర్లను ఆపుతున్నట్లు మేము భావిస్తున్నాం. దీనిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి. 144 సెక్షన్‌ను అతిక్రమించి బీఆర్ఎస్ మంత్రులు, శ్రేణులు కార్యక్రమాలు నిర్వహించారు. కొన్ని పత్రికలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వార్తల పేరుతో బీఆర్ఎస్‌కు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు. దీన్ని కట్టడి చేయాలి. ఈరోజు, రేపు ఓటర్లకు డబ్బులు, మద్యం పంపిణీ చేసేందుకు బిఆర్ ఎస్ ఏర్పాట్లు చేస్తోంది. దీన్ని కట్టడి చేయాలని సీఈఓను కోరాం’ అని చెప్పారు.

Also Read: Fire Accident: హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం.. భయాందోళనలో స్థానికులు