NTV Telugu Site icon

Congress On KTR: కారు నాలుగు టైర్లు పేల్చేసిన కేటీఆర్!

Counter To Ktr

Counter To Ktr

Congress Counters On Minister KTR:తెలంగాణ ఎన్నికల ఫలితాలు అన్నీ కాంగ్రెస్ కు అనుకూలంగా వస్తున్నాయి. అన్ని పార్టీల అభ్యర్థులు, శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొనగా నిన్న మంత్రి కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. గన్ గురి పెడుతున్నట్లు ఉన్న ఓ ఫొటోను పోస్ట్ చేసిన మంత్రి కేటీఆర్‌ అందులో “హ్యాట్రిక్ లోడింగ్ 3.o.. గెట్ రెడీ సెలబ్రేటీ గాయ్స్” అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్ గెలుపుపై విశ్వాసం వ్యక్తం చేశారు అభిమానులు. ఆయన అదే కాదు నిన్న ఉదయం కూడా ఒక ట్వీట్ చేశారు.

Breaking News: రేవంత్ రెడ్డి నివాసానికి తెలంగాణ డీజీపీ

ఎగ్జిట్ పోల్స్ ను నమ్మవద్దని, ఇంతకుముందు కూడా ఎగ్జిట్ పోల్స్ తప్పుగా వచ్చాయని, ఎగ్జాక్ట్ పోల్స్ మాకు శుభవార్తనిస్తాయని ఉదయం ఒక ట్వీట్ చేశారు. చాలా కాలం తర్వాత నిన్న రాత్రి బాగా నిద్రపోయానని కూడా మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు, ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో అతిశయోక్తులు ఉన్నాయని.. కౌంటింగ్ లో మంచి ఫలితాలు వస్తాయని కేటీఆర్ వివరించారు. అయితే ఈ ట్వీట్ కు కౌంటర్ గా తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా ట్విట్టర్ హ్యాండిల్ నుంచి కౌంటర్ ఇచ్చారు. నిన్న కేటీఆర్ పెట్టిన గురి తప్పలేదు, కారు నాలుగు టైర్లు పేల్చేశాడు అని అంటూ కౌంటర్ వేశారు.