NTV Telugu Site icon

BRS Vs Congress: కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ.. గులాబీ నేతపై కేసు నమోదు

Brs Vs Congress

Brs Vs Congress

మహముత్తారం: కిష్ణాపూర్ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం రాత్రి కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల‌ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రెండు పార్టీల నాయకులు మధ్య జరిగిన గొడవలో ఓడెడ్ సర్పంచ్, కాంగ్రెస్ నేత సిరికొండ బక్కారావు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై బక్కారావు కొడుకు సందీప్ మహముత్తారం పోలీసుల స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు తన తండ్రి బక్కారావు, తల్లిపై హత్యయత్నం చేసిన సందీప్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Also Read: IND vs AUS T20: విశాఖ వేదికగా తొలి టీ20.. భారత్-ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!

సర్పంచ్ బక్కారావు కొడుకు ఫిర్యాదు మేరకు పోలీసులు బీఆర్ఎస్ పార్టీకి చెందని 28 మంది కార్యకర్తలపై 109,307,341,427,149 ఐపీసీ సెక్షన్ల కింద కేసు చేశారు. A1 నిందితుడిగా మహముత్తారం మాజీ జడ్పీటీసీ మందల రాజీరెడ్డి, A2గా వెల్మరెడ్డి అనీల్ రెడ్డి, A27 గా మంథని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకర్, A28 పుట్టమధు మేనల్లుడు బిట్టు శ్రీనివాస్‌లపై కేసు నమోదనట్టు సమాచారం. కాగా అడ్వకేట్ వామన్ రావు దంపతుల హత్యకేసులో నిందితుడిగా ఉన్న బిట్టు శ్రీనివాస్.. ఇటివల బేయిల్‌పై బయటకు వచ్చినట్టు తెలుస్తోంది.

Also Read: Vijayashanthi: కేసీఆర్ గెలిస్తే తెలంగాణ బతుకు నాశనం అవుతుంది..