YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YouTube Shorts: ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ (YouTube) లోని షార్ట్స్ (Shorts) కోసం పలు కొత్త ఫీచర్లను ప్రకటించింది. గత ఐదేళ్లుగా వినియోగదారుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను ఆధారంగా తీసుకుని ఈ మార్పులను తీసుకువచ్చినట్లు సంస్థ తెలిపింది. వీటి ద్వారా వినియోగదారులకు మరింత బెటర్ వీక్షణ అనుభవం అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
క్లియర్ స్క్రీన్ మోడ్:
YouTube Shortsలో కొత్తగా క్లియర్ స్క్రీన్ మోడ్ “Clear Screen Mode” అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసినప్పుడు వీడియోపై కనిపించే టెక్స్ట్ వివరాలు, లైక్, కామెంట్, షేర్ వంటి ఐకాన్లు తాత్కాలికంగా కనిపించవు. దీంతో ఎలాంటి అంతరాయాలు లేకుండా పూర్తి స్క్రీన్‌లో వీడియోను చూడవచ్చు.
Also Read
- 55 రోజుల స్టాండ్‌బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
- Vivo Y6a: మార్కెట్ లోకి వివో Y6a.. 7200 mAh బ్యాటరీ, 50MP కెమెరా
- Vivo X Fold 6: 200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో వివో ఎక్స్ ఫోల్డ్ 6 విడుదల.. ఫోల్డబుల్ ఫోన్లలో కొత్త బెంచ్‌మార్క్
- Smartphone Restart Benefits: స్మార్ట్‌ఫోన్‌ను రీస్టార్ట్ చేయాలా?.. టెక్ నిపుణులు చెబుతున్న సీక్రెట్స్..
2X స్పీడ్ ప్లేబ్యాక్:
వినియోగదారుల నుంచి ఎక్కువగా వచ్చిన డిమాండ్ మేరకు యూట్యూబ్ షార్ట్స్ లో 2X ప్లేబాక్ స్పీడ్ ఫీచర్‌ను కూడా ప్రవేశపెడుతోంది. దీని సహాయంతో వీడియోలను రెట్టింపు వేగంతో చూడవచ్చు. ముఖ్యంగా సమాచారం ఆధారిత లేదా కొంచెం ఎక్కువ నిడివి ఉన్న షార్ట్ వీడియోలను త్వరగా వీక్షించాలనుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
కొత్త ఆడియో కంట్రోల్స్:
ఇకపై షార్ట్స్ వీడియోల ఆడియోను మ్యూట్ చేయడం కూడా మరింత సులభం కానుంది. వీడియోను ట్యాప్ చేసి పాజ్ చేసిన తర్వాత ప్రత్యేకంగా ఇచ్చిన మ్యూట్ ఐకాన్ ద్వారా సౌండ్‌ను ఆఫ్ చేయవచ్చు. దీంతో వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా వీడియోలను వీక్షించగలరు.
షార్ట్స్ టైమర్:
యూట్యూబ్ మరో కొత్త ఫీచర్‌గా షార్ట్స్ టైమర్ ను పరిచయం చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు చూసే సమయాన్ని నియంత్రించుకోవచ్చు. టైమర్‌ను జీరోకి సెట్ చేసే అవకాశం కూడా ఉండటంతో మరింత ఖచ్చితమైన నియంత్రణ ఇందులో లభిస్తుంది.
ఫీడ్ సిఫార్సు:
వీడియోలపై వినియోగదారుల స్పందన ఆధారంగా కంటెంట్‌ను సిఫార్సు చేసే విధానంలో కూడా యూట్యూబ్ మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఉన్న థంబ్-అప్ బటన్ స్థానంలో హార్ట్ (❤️) ఐకాన్ ను తీసుకురానుంది. అలాగే షార్ట్స్ ప్లేయర్లో ఉన్న డిస్ లైక్ బటన్‌ను తొలగించనుంది. యూట్యూబ్ ప్రకారం, డిస్లైక్ బటన్ ద్వారా వినియోగదారుల అభిప్రాయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడం కష్టమవుతోందని తెలిపింది. కొందరు వీడియో నాణ్యత బాగోలేదని డిస్లైక్ చేస్తే.. మరికొందరు కేవలం ఆ కంటెంట్‌పై ఆసక్తి లేక డిస్లైక్ చేస్తున్నారని సంస్థ గుర్తించింది.
‘Not Interested’ ఆప్షన్:
డిస్లైక్ బటన్ స్థానంలో “Not Interested”, “Don’t Recommend This Channel” వంటి ఎంపికలను మరింత ప్రాధాన్యంతో ఉపయోగించనున్నారు. వీటి ద్వారా వినియోగదారుల అభిరుచులను మెరుగ్గా అర్థం చేసుకుని, వారికి అనుగుణమైన వీడియోలను సిఫార్సు చేయనున్నట్లు యూట్యూబ్ వెల్లడించింది. అయితే కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌కు విరుద్ధంగా ఉన్న వీడియోలను రిపోర్ట్ చేసే అవకాశం మాత్రం యథావిధిగా కొనసాగుతుంది. ఈ కొత్త ఫీచర్లు దశలవారీగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ షార్ట్స్ వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.
తాజావార్తలు
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!
-
India vs Ireland T20: అరంగేట్రంలోనే టీమిండియాకు షాకిచ్చిన ఐర్లాండ్ బౌలర్.. ఎవరీ మాథ్యూ హోలార్డ్..?
-
Ram Charan : RC 17.. ఓ చిన్న కన్ఫ్యూజన్
-
Broken Cups Reuse Idea: విరిగిన కప్పులే మీ ఇంటి అందాన్ని పెంచుతాయి.. ఈ ట్రిక్స్ తెలుసా?
-
SS Rajamouli: “ఆ అభిమాని ఆఖరి కోరిక తీరింది”.. కెమెరా ముందే కన్నీళ్లు పెట్టుకున్న రాజమౌళి..
ట్రెండింగ్
-
55 రోజుల స్టాండ్‌బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!