Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూట్యూబ్ భారత్ లో YouTube Shopping Affiliate ప్రోగ్రాంను భారీగా పేర్చడానికి సిద్దమవుతుంది. ఇందులో భాగంగా దేశీయంగా “అమెజాన్”ను కొత్త రిటైల్ భాగస్వామిగా చేర్చింది. త్వరలో AJIO, Meesho, Snapdeal, Tata CLiQ వంటి ప్లాట్‌ఫామ్స్‌ను కూడా ఈ ప్రోగ్రామ్‌లోకి తీసుకురానుంది. ఇప్పటికే ఫ్లిప్ కార్ట్, మైంత్ర, నైకా, పురుపల్లె, షాప్సీ, తీరా వంటి సంస్థలు YouTube Shoppingలో భాగంగా ఉన్నాయి.
కొత్త భాగస్వామ్యాలతో యూట్యూబ్ ఒకే కామర్స్ క్యాటలాగ్ ద్వారా వివిధ రిటైల్ ప్లాట్‌ఫామ్స్‌లోని ఉత్పత్తులను వినియోగదారులకు అందించనుంది. దీంతో యూట్యూబ్‌లో వీడియో చూస్తున్న సమయంలోనే సంబంధిత ఉత్పత్తులను గుర్తించి కొనుగోలు చేసే అవకాశం మరింత సులభం కానుంది. మొబైల్, డెస్క్‌టాప్‌తో పాటు కనెక్టెడ్ టీవీ వంటి పరికరాల్లో కూడా వీడియో కంటెంట్ నుంచి నేరుగా షాపింగ్‌కు వెళ్లే విధానాన్ని యూట్యూబ్ మరింత పెంచుతుంది.
Also Read
- Honor X9e Pro: 11,000mAh బ్యాటరీతో హానర్ X9e ప్రో 5G లాంచ్.. 10,000 నిట్స్ డిస్ప్లే, 108MP కెమెరా
- itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
- Xiaomi TV: Xiaomi TV S Pro RGB-Mini LED 2027 సిరీస్ లాంచ్.. 98 ఇంచెస్ స్క్రీన్, Dolby Atmos, HyperOS 4
- MIVI ONE 5G: మివి వన్ 5G భారత్‌లో లాంచ్.. Snapdragon 4 Gen 2, 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ
షాపింగ్ కంటెంట్ కోసం సెర్చ్
యూట్యూబ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. భారత్‌లో 45 కోట్లకు పైగా లాగిన్ అయిన యూజర్లు షాపింగ్‌కు సంబంధించిన కంటెంట్‌ను యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తున్నారు. దీంతో షాపింగ్‌కు సంబంధించిన వీడియోలను చూసే సమయం ఏడాదికి ఏడాది 55% పెరిగింది. ఇక క్రియేటర్ల విషయానికి వస్తే.. అర్హత ఉన్న భారతీయ క్రియేటర్లలో 50 శాతానికి పైగా ఇప్పటికే YouTube Shopping Affiliate ప్రోగ్రాంలో చేరారు. ఏడాది వ్యవధిలో ఈ సంఖ్య 200% పెరిగింది. ఇప్పటివరకు 1.9 కోట్లకు పైగా వీడియోలకు షాపింగ్ ట్యాగ్లు జోడించినట్లు యూట్యూబ్ తెలిపింది.
భారీగా పెరిగిన ఆదాయం
యూట్యూబ్ షాపింగ్ ద్వారా భారతీయ క్రియేటర్లకు లభించే సగటు అఫిలియేట్ చెల్లింపులు కూడా గణనీయంగా పెరిగాయి. 2025 మొదటి త్రైమాసికం నుంచి 2026 మొదటి త్రైమాసికం మధ్య 160 శాతానికి పైగా పెరిగినట్లు కంపెనీ పేర్కొంది. దీంతో యూట్యూబ్ కేవలం వీడియోలను ప్రచురించే వేదికగా కాకుండా.. క్రియేటర్లకు కంటెంట్ ద్వారా నేరుగా ఆదాయం పొందే కామర్స్ ప్లాట్‌ఫామ్‌గా కూడా తన పరిధిని విస్తరిస్తోంది.
AIతో ప్రొడక్ట్స్ గురించి
షాపింగ్ అనుభవాన్ని మరింత సులభతరం చేసేందుకు యూట్యూబ్ AI ఆధారిత ఫీచర్లను కూడా తీసుకొస్తోంది. ‘Ask YouTube’ అనే ఇంటరాక్టివ్ ఫీచర్ ద్వారా వీడియో చూస్తున్న సమయంలోనే ఉత్పత్తికి సంబంధించిన వివరాలను యూజర్లు ప్రశ్నించవచ్చు. మొబైల్లో ఈ ఫీచర్‌తో పాటు స్మార్ట్ టీవీల్లో వాయిస్ కమాండ్స్ ద్వారా కూడా ప్రొడక్ట్ స్పెసిఫికేషన్స్, ఇతర వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. వీడియో మధ్యలోనే సంబంధిత ప్రశ్నలు అడిగి మరింత సమాచారాన్ని పొందవచ్చు.
కేవలం భారత్ లో మాత్రమే కాకుండా.. వివిధ దేశాల్లో ప్రేక్షకులను కలిగి ఉన్న క్రియేటర్ల కోసం డైనమిక్ ప్రొడక్ట్ ట్యాగింగ్ సదుపాయాన్ని కూడా యూట్యూబ్ తీసుకొస్తోంది. ప్రేక్షకుడు ఏ దేశంలో ఉన్నాడో గుర్తించి.. అక్కడ అందుబాటులో ఉన్న రిటైలర్ లింక్, స్థానిక కరెన్సీకి అనుగుణంగా ప్రొడక్ట్ ట్యాగ్ ఆటోమేటిక్‌గా మారుతుంది. దీంతో భారతీయ క్రియేటర్లు ఇతర దేశాల నుంచి వచ్చే వీక్షణలను కూడా సంబంధిత మార్కెట్లలోని ఉత్పత్తుల ద్వారా అఫిలియేట్ ఆదాయంగా మార్చుకునే అవకాశం ఉంటుంది.
బ్రాండ్లు, క్రియేటర్ల కోసం కొత్త టూల్స్
బ్రాండ్లు, క్రియేటర్ల మధ్య భాగస్వామ్యాలను సులభతరం చేసేందుకు యూట్యూబ్ పలు కొత్త టూల్స్‌ను కూడా ప్రవేశపెడుతోంది. మంచి పనితీరు కనబరిచిన క్రియేటర్ కంటెంట్‌ను బ్రాండ్లు పెయిడ్ యాడ్స్‌గా ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తోంది. అలాగే Ask Studio for Brand Partnerships పేరుతో జనరేటివ్ AI ఆధారిత ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ఇది బ్రాండ్ల నుంచి వచ్చే ప్రకటన ప్రతిపాదనలకు క్రియేటర్లు స్పందించేందుకు, పిచ్‌లను సిద్ధం చేసేందుకు సహాయపడుతుంది. క్రియేటర్ పార్టనర్ షిప్స్ బూస్ట్ ద్వారా వీడియో ప్రచురించిన వెంటనే అడ్వర్టైజర్లకు పనితీరు డేటాను యాక్సెస్ చేసి, ఆ వీడియోపై పెయిడ్ ప్రమోషన్ నిర్వహించే అవకాశం కల్పించనుంది.
20 వీడియోలకు ఒకేసారి
ప్రస్తుతం పరీక్ష దశలో ఉన్న “డైనమిక్ బ్రాండ్ సెగ్మెంట్స్” ఫీచర్ ద్వారా గరిష్ఠంగా 20 లాంగ్-ఫార్మ్ వీడియోల్లో ఒకేసారి స్పాన్సర్డ్ సెగ్మెంట్లను చేర్చే అవకాశం ఉంటుంది. ఇందులో ప్రాంతాల వారీగా టార్గెటింగ్‌తో పాటు నేరుగా కొనుగోలుకు తీసుకెళ్లే ప్రొడక్ట్ షెల్ఫ్, కాల్-టు-యాక్షన్ బటన్లు ఉంటాయి. అదేవిధంగా వచ్చే ఏడాది “ఎక్సక్లూసివ్ అఫిలియేట్ క్యాంపైజైన్స్”ను కూడా పెంచుకోనుంది. ఇందులో ఎంపిక చేసిన క్రియేటర్లకు ప్రత్యేక క్యాంపెయిన్ ఆహ్వానాలతో పాటు అధిక కమీషన్లు, పనితీరు ఆధారిత బోనస్‌లు లభించే అవకాశం ఉంటుంది.
తాజావార్తలు
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
Kareena – Aiswarya : బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ & కరీనా కపూర్ సినిమా కెరీర్ ఫేడవుట్ దశకు చేరుకున్నట్లే?
-
Honor X9e Pro: 11,000mAh బ్యాటరీతో హానర్ X9e ప్రో 5G లాంచ్.. 10,000 నిట్స్ డిస్ప్లే, 108MP కెమెరా
-
Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్.. ఐదుగురు సభ్యులతో కొత్త కమిటీ
-
TN SESHAN: రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఒక్క మొనగాడు..! శేషన్ ఇప్పుడు ఉండి ఉంటేనా..!
ట్రెండింగ్
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!