Site icon NTV Telugu

అండర్ డిస్‌ప్లే 3D ఫేస్ రికగ్నిషన్ సపోర్ట్ తో రానున్న Xiaomi Mix 5..!

Xiaomi Mix 5

Xiaomi Mix 5

Xiaomi Mix 5: షియోమీ (Xiaomi) డిజైన్ ఆధారిత ఫ్లాగ్‌షిప్ సిరీస్ Mix లైన్‌అప్‌ను తిరిగి తీసుకవస్తుందా అంటే.. తాజా లీక్‌ల ప్రకారం, కంపెనీ Xiaomi Mix 5 పేరుతో కొత్త ప్రయోగాత్మక స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ ఆపిల్ ఐఫోన్ 18 సిరీస్‌కు ముందే లాంచ్ అయ్యే అవకాశం ఉందని టెక్ వర్గాల్లో చర్చ సాగుతోంది. Mix సిరీస్‌ను షియోమీ ఎప్పుడూ అత్యాధునిక టెక్నాలజీ షోకేస్‌గా ఉపయోగించింది. అదే వ్యూహాన్ని Mix 5తో మరోసారి అమలు చేయాలని కంపెనీ భావిస్తున్నట్లు లీక్‌లు చెబుతున్నాయి.

New Year Songs: న్యూ ఇయర్ పార్టీ కోసం.. 2025లో ట్రెండ్ సెట్ చేసిన టాప్ 5 సాంగ్స్

ముఖ్యంగా ఫ్రంట్ డిస్‌ప్లే పూర్తిగా అంతరాయం లేకుండా (Uninterrupted Front Display) ఉండేలా డిజైన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ (Digital Chat Station) లో చేసిన పోస్ట్ ప్రకారం.. ఓ ప్రముఖ బ్రాండ్ క్వాడ్ కర్వ్ డిస్‌ప్లేతో పాటు అండర్ డిస్‌ప్లే సెల్ఫీ కెమెరా కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధి చేస్తోంది. మరో నివేదిక సమాచారం ప్రకారం.. Xiaomi Mix 5లో అండర్ డిస్‌ప్లే 3D ఫేస్ రికగ్నిషన్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. ఇది నిజమైతే ఈ టెక్నాలజీని కమర్షియల్ స్మార్ట్‌ఫోన్‌లో తీసుకువచ్చిన మొదటి కంపెనీగా షియోమీ చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.

Ibomma Ravi: క్యాంకాడర్ ప్రింట్కు ఓ రేట్.. HD ప్రింట్లకు ఓ రేట్.. కథ మాములుగా లేదుగా..!

షియోమీ చివరిసారిగా ఆగస్టు 2021లో షియోమీ Mix 4ను విడుదల చేసింది. ఆ ఫోన్‌లో కంపెనీ తొలి అండర్ డిస్‌ప్లే ఫ్రంట్ కెమెరా, సిరామిక్ యూనిబాడీ డిజైన్, స్నాప్ డ్రాగన్ 888+ ప్రాసెసర్, 6.67 ఇంచుల AMOLED డిస్‌ప్లే, 20MP హిడెన్ సెల్ఫీ కెమెరాను అందించింది. అయితే అప్పటి అండర్ డిస్‌ప్లే టెక్నాలజీ పరిమితుల కారణంగా సెల్ఫీ కెమెరా అనుభవం అంతగా ఆకట్టుకోలేకపోయింది. నాలుగేళ్ల విరామం తర్వాత వస్తున్న Mix 5, అండర్ డిస్‌ప్లే టెక్నాలజీలో భారీ మెరుగుదలతో పాటు.. షియోమీ ఇన్నోవేషన్ శక్తిని మరోసారి ప్రపంచానికి చూపించనుందని అంచనాలు ఉన్నాయి. అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉన్నా, లీక్‌లు మాత్రం షియోమీ Mix సిరీస్ గ్రాండ్ కంబ్యాక్‌కు భారీ సంకేతాలు ఇస్తున్నాయి.

Exit mobile version