Site icon NTV Telugu

50MP క్వాడ్ కెమెరా లెన్స్‌, 7000mAh బ్యాటరీ, OLED డిస్‌ప్లే, కూలింగ్ సిస్టమ్‌తో వచ్చేసిన Xiaomi 17

Xiaomi 17

Xiaomi 17

Xiaomi 17: షియోమీ తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ షియోమీ 17 (Xiaomi 17)ని చైనాలో విడుదల చేసింది. ఈ ఫోన్‌లో అత్యుత్తమ ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్ ఉన్నాయి. ఇందులో 6.3 అంగుళాల 1.5K OLED ఫ్లాట్ M10 LTPO ప్యానెల్ ఉంది. ఇది 1-120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. డిస్‌ప్లే ముఖ్యమైన ఫీచర్ 3500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, ఇది కొత్త “రెడ్ లైట్ ఎమిటింగ్ మెటీరియల్”తో తయారు చేయబడింది. డిస్‌ప్లేకు షియోమీ డ్రాగన్ క్రిస్టల్ గ్లాస్ రక్షణగా ఉంది.

India vs Pakistan: అమ్మో, భారత్‌తో మ్యాచ్ అంటేనే భయమేస్తుంది.. పాక్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు!

ఇక ఫోన్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఇది సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనితోపాటు గరిష్టంగా 16GB LPDDR5X RAM, అలాగే ఇందులో రింగ్ ఆకారపు కూలింగ్ సిస్టమ్ ఉంటాయి. దీనివల్ల గేమింగ్ ఆడేటప్పుడు కూడా ఫోన్ వేడెక్కకుండా ఉంటుంది. కెమెరా పరంగా, ఇందులో లీకా సుమ్మిలక్స్ లెన్స్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP ప్రధాన కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, మరియు 50MP 2.6X టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కెమెరాను కూడా 50MPకి అప్‌గ్రేడ్ చేశారు. ఈ ఫోన్‌లో ఉన్న 7000mAh బ్యాటరీ మరో ప్రధాన ఆకర్షణ. ఇది 100W షియోమీ సర్జ్ వైర్డ్ ఛార్జింగ్, 50W షియోమీ సర్జ్ వైర్‌లెస్ ఛార్జింగ్, 22.5W వైర్డ్, వైర్‌లెస్ రివర్స్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది.

200MP టెలిఫోటో కెమెరా, IP68 రేటింగ్, అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్‌తో ప్రీమియమ్ లుక్‌లో రాబోతున్న Realme GT 8 Pro..

షియోమీ 17 ధర విషయానికి వస్తే.. 12GB + 256GB మోడల్‌ను 4499 యువాన్ (రూ.55,880), 12GB + 512GB మోడల్‌ను 4799 యువాన్ (రూ.59,700), 16GB + 512GB మోడల్‌ 4999 యువాన్ (సుమారు రూ.62,185). ఈ ఫోన్ చైనాలో అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది.

Exit mobile version