iProjector 3 Plus: థియేటర్‌కు వెళ్లనవసరం లేదు.. మీ ఇంట్లోనే అదిరిపోయే థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్!

Xelectron

Xelectron

iProjector 3 Plus: ఈ రోజుల్లో ఇంట్లోనే సినిమా థియేటర్ అనుభూతిని పొందాలని ఎవరికి ఉండదు చెప్పండి. అందుకే వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ప్రముఖ టెక్ కంపెనీ ‘XElectron’ భారత మార్కెట్లోకి సరికొత్త ప్రీమియం ప్రొజెక్టర్‌ను రిలీజ్ చేసింది. ‘iProjector 3 Plus’ పేరుతో వచ్చిన ఈ ప్రొజెక్టర్‌ అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్ టీవీలకు గట్టి పోటీనిస్తోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. పెద్ద స్క్రీన్‌పై సినిమాలు చూడాలనుకునే వారి కోసం XElectron iProjector 3 Plus ఒక అద్భుతమైన ఎంపికగా పేర్కొంటున్నారు. ఫుల్ HD క్వాలిటీతో పాటు గూగుల్ టీవీ (Google TV) సపోర్ట్‌తో వస్తున్న ఈ ప్రొజెక్టర్, మీ ఇంటిని మినీ థియేటర్‌లా మార్చేస్తుందని చెబుతున్నారు. ఈ ప్రొజెక్టర్ ప్రత్యేకతలు, ధర, ఫీచర్ల వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Telangana Municipal Elections: ముగిసిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు.. 13న ఫలితాలు..!

4K సపోర్ట్.. 300 అంగుళాల డిస్‌ప్లే
ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ 1080p (Full HD) రిజల్యూషన్‌ను అందిస్తుంది. అంతేకాకుండా ఇది 4K కంటెంట్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. సాధారణంగా టీవీలు 55 లేదా 65 అంగుళాల వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కానీ ఈ ప్రొజెక్టర్ ఏకంగా 300 అంగుళాల వరకు భారీ స్క్రీన్‌ను ప్రొజెక్ట్ చేయగలదని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అంటే దీంతో మీ ఇంటి గోడనే ఒక భారీ సినిమా స్క్రీన్‌లా మార్చుకోవచ్చన్నమాట. ఇది కేవలం ప్రొజెక్టర్ మాత్రమే కాదు, ఒక స్మార్ట్ పరికరం కూడా. ఇందులో Google TV ఇంటిగ్రేట్ అయి ఉండటం వల్ల నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జీ5, సోనీ లివ్, జియో హాట్‌స్టార్ వంటి పాపులర్ OTT ప్లాట్‌ఫారమ్‌లను నేరుగా యాక్సెస్ చేసుకోవచ్చు. దీని కోసం విడిగా ఎటువంటి డాంగిల్స్ లేదా స్టిక్స్ అవసరం లేదని కంపెనీ పేర్కొంది.

సులభంగా సెటప్ చేసుకోవచ్చు..
చాలా ప్రొజెక్టర్లలో స్క్రీన్‌ను సరిగ్గా సెట్ చేయడం పెద్ద సవాలుగా ఉంటుంది. కానీ ఈ iProjector 3 Plus లో ఆ సమస్య లేదు. ఇందులో ఉన్న

ఆటోఫోకస్: చిత్రం దానంతట అదే స్పష్టంగా మారుతుంది.

ఆటో కీస్టోన్ కరెక్షన్: స్క్రీన్ వంకరగా ఉన్నా ఆటోమేటిక్‌గా సరిచేస్తుంది.

అడ్డంకుల గుర్తింపు (Obstacle Detection): స్క్రీన్ మధ్యలో ఏవైనా అడ్డంకులు ఉంటే గుర్తించి ఇమేజ్ ఫ్రేమింగ్‌ను సెట్ చేస్తుంది.

ఈ ప్రొజెక్టర్ 25,000 ల్యూమెన్ల ప్రకాశాన్ని (Brightness) కలిగి ఉంది. దీనివల్ల గదిలో లైట్లు ఉన్నా కూడా చిత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఇందులో 20W శక్తివంతమైన స్పీకర్లు ఉన్నాయి. కాబట్టి విడిగా హోమ్ థియేటర్ సిస్టమ్ లేకపోయినా మంచి ఆడియో అనుభూతిని పొందవచ్చు. బ్లూటూత్ 5.4 వెర్షన్‌తో వస్తున్న ఈ పరికరంలో HDMI, USB మరియు LAN పోర్ట్లు ఉన్నాయి. గేమింగ్ కన్సోల్స్ లేదా లాప్‌టాప్‌లను సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు.

దీని ధర విషయానికి వస్తే..

ధర: రూ.27,990. ఇది అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ప్రముఖ రిటైల్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉంది. కంపెనీ ఈ ప్రొజెక్టర్‌పై ఒక సంవత్సరం వారంటీని కూడా అందిస్తోంది. ఈ సందర్భంగా XElectron మేనేజింగ్ డైరెక్టర్ గగన్ శర్మ మాట్లాడుతూ.. తక్కువ ధరకు ప్రీమియం ఫీచర్లు అందించడమే మా లక్ష్యం అని అన్నారు. ఈ ప్రొజెక్టర్ ఇండోర్ లైటింగ్‌లోనూ అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని ఆయన తెలిపారు. మీరు కూడా మీ ఇంటిని థియేటర్‌లా మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ iProjector 3 Plus పై ఒక కన్నేయండి.

READ ALSO: US Iran Tensions: ఇరాన్‌పై యుద్ధానికి సై అంటున్న అమెరికా.. వణుకుపుట్టిస్తున్న శాటిలైట్ ఫోటోలు!