OnePlus Ace 6T: వన్ ప్లస్ (OnePlus) కొత్తగా Ace సిరీస్‌లో భాగంగా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ OnePlus Ace 6T ను చైనాలో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఫోన్ పర్ఫార్మెన్స్, గేమింగ్, కూలింగ్, బ్యాటరీ లాంటి ఫీచర్లతో ఆకట్టుకోనుంది. OnePlus Ace 6T స్మార్ట్ ఫోన్ ప్రధాన హైలైట్ దాని ప్రాసెసర్. ఇది Snapdragon 8 Gen 5 చిప్‌తో వచ్చిన ప్రపంచంలోని తొలి స్మార్ట్‌ఫోన్. ఈ చిప్‌కు తోడు 16GB LPDDR5X ర్యామ్, UFS 4.1 స్టోరేజ్, కొత్తగా అభివృద్ధి చేసిన గేమింగ్ నెట్వర్క్ చిప్ G2, 3200Hz టచ్ సాంప్లింగ్ రేట్ సపోర్ట్ ఉన్నాయి. ఇవన్నీ కలిసి గేమింగ్, మల్టీటాస్కింగ్‌ను ఒక కొత్త స్థాయికి తీసుకవెలుతుంది.
IND vs SA: విశాఖ నగరంలో క్రికెట్ సందడి.. హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు!
OnePlus Ace 6Tను గేమింగ్‌కు సరిపోయేలా ప్రత్యేకంగా ట్యూన్ చేశారు. ఈ ఫోన్‌లో నేటివ్ 165fps గేమింగ్ సపోర్ట్ ఉంది. శాంప్లింగ్ రేట్ ఎక్కువగా అవసరమైన గేమ్స్‌లో ఇది మంచి ఫలితాలు ఇస్తుంది. ఇందులోని Wind Chaser గేమ్ కెర్నల్ ద్వారా అన్ లిమిటెడ్ ఫుల్ ఫ్రేమ్ గేమింగ్, ఇండస్ట్రీ లీడింగ్ 1% low FPS పెర్ఫార్మన్స్, GPU సూపర్ ఫ్రేమ్ రెండరింగ్ వంటి ఫీచర్లు గేమింగ్ అనుభవాన్ని మరింత సాఫీగా చేస్తాయి. ఈ ఫోన్‌లోని Glacier VC కూలింగ్ సిస్టం ప్రత్యేకంగా హీట్ తగ్గించడానికి రూపొందించబడింది. ఇది 2 రెట్లు వేగంగా వేడిని తగ్గిస్తుంది. ఇందులో 43% పెద్ద వేపర్ లిక్విడ్ కూలింగ్ చాంబర్, గ్లేసియర్ థర్మల్ జెల్, గ్రాఫైట్ వాడటం వల్ల 50% మెరుగైన థర్మల్ పనితీరు అందిస్తుంది. ఇందులోని మొత్తం 43,940mm² పెద్ద హీట్ డిసిపేషన్ ఏరియా వన్ ప్లస్ చరిత్రలోనే అతి పెద్దది.
OnePlus Ace 6Tలో 8300mAh భారీ బ్యాటరీ ఉంది. ఇది ప్రపంచంలో ఉన్న ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో అతి పెద్ద బ్యాటరీ. 100W SuperVOOC ఛార్జింగ్‌తో ఫోన్‌ను 1% నుంచి 50% వరకు కేవలం 23 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. 55W PPS ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ అవుతాయి. కెమెరా విభాగంలో కూడా ఈ ఫోన్ మంచి సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50MP సోనీ IMX906 ప్రధాన కెమెరా OISతో, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 4K 60fps వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉన్నాయి. ముందు వైపున 16MP సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంది. ఇక IP66 + IP68 + IP69K పూర్తి స్థాయి ప్రొటెక్షన్ తో OnePlus Ace 6T దుమ్ము, నీరు, వేడి, హై ప్రెషర్ వాటర్ జెట్లకు కూడా అత్యధిక స్థాయి రక్షణను అందిస్తుంది.
ఈ ఫోన్ ఫాంటమ్ గ్రీన్, ఫ్లాష్ బ్లాక్, ఎలక్ట్రిక్ పర్పుల్ అనే ముగ్గురు ఆకర్షణీయమైన కలర్ వెర్షన్లలో లభిస్తుంది. అలాగే ప్రత్యేక జెన్షిన్ ఇంపాక్ట్ కమిసాటో అయాకా ఎడిషన్ (Genshin Impact Kamisato Ayaka Edition) కూడా ఉంది. Snowy Blue కలర్‌తో వచ్చే ఈ స్పెషల్ ఎడిషన్ పూర్తి UI కస్టమైజేషన్, కస్టమ్ గిఫ్ట్ బాక్స్, టాయ్స్, చార్జింగ్ కిట్ మరెన్నో ప్రత్యేక ఐటమ్స్‌తో వస్తుంది. ఇక ఈ మొబైల్ ప్రారంభ విక్రయంలో 200 యువాన్ (రూ.2,500) భారీ తగ్గింపు ఇవ్వడం వల్ల టెక్ లవర్స్‌కి ఇది మరింత ఆకర్షణీయంగా మారింది. డిసెంబర్ 5 నుంచి చైనాలో సేల్ ప్రారంభం కాగా, ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. ఈ మొబైల్స్ 2599 యువాన్స్ నుండి ధరలు ప్రారంభమవుతాయి. ఈ ఫోన్ డిసెంబర్ 17న గ్లోబల్‌గా లాంచ్ కాబోతోంది. భారత్‌లో ఇది OnePlus 15R పేరుతో విడుదల అవుతుంది. అయితే స్పెసిఫికేషన్లలో కొంత మార్పులుండే అవకాశం ఉంది.
