Site icon NTV Telugu

ఒక్కసారి చార్జ్ చేస్తే 22 రోజుల స్టాండ్ బై లైఫ్‌, 50MP సోనీ కెమెరాతో వచ్చేసిన Wobble One స్మార్ట్‌ఫోన్..!

Wobble One

Wobble One

Wobble One: భారతీయ మార్కెట్‌లోకి కొత్తగా అడుగుపెట్టిన ఇండ్కాల్ టెక్నాలజీస్‌కు చెందిన Wobble బ్రాండ్ తన తొలి స్మార్ట్‌ఫోన్ Wobble One ను అధికారికంగా లాంచ్ చేసింది. ముందుగా చెప్పిన విధంగానే లాంచ్ అయినా ఈ ఫోన్ ప్రీమియమ్ ఫీచర్లతో మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో పోటిని మరింత పెంచుతోంది. 6.67 అంగుళాల FHD+ 120Hz AMOLED ఫ్లాట్ డిస్‌ప్లే, డాల్బి విజన్ సపోర్ట్‌తో ఈ ఫోన్ విజువల్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. మెటల్ ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్‌తో రూపొందించిన ప్రీమియమ్ డిజైన్ ఫోన్‌కు హై-ఎండ్ లుక్‌ను అందిస్తుంది.

Manchu Manoj : రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్ – డ్రగ్స్‌పై కఠిన హెచ్చరిక

పనితీరులో కూడా Wobble One బెస్ట్ గా నిలుస్తోంది. దీనిలోని MediaTek Dimensity 7400 4nm ప్రాసెసర్‌తో పాటు ‘ఎపిక్ హైపర్ ఇంజిన్ గేమింగ్ టెక్నాలజీ’ గేమింగ్, హెవీ మల్టీటాస్కింగ్ సమయంలో ల్యాగ్ లేకుండా స్మూత్ పనితీరును అందిస్తుంది. 12GB వరకు వివిధ ర్యామ్ వేరియంట్లు అందుబాటులో ఉండటం వినియోగదారులకు మరింత వేగవంతమైన అనుభూతిని ఇస్తుంది. కెమెరా పరంగా కూడా ఈ స్మార్ట్‌ఫోన్ ఆకట్టుకుంటుంది. ఇందులో 50MP Sony LYT-600 ప్రధాన కెమెరా OIS సపోర్ట్‌తో వస్తుండగా, 8MP అల్ట్రా-వైడ్, 2MP మాక్రో కెమెరాలు అదనంగా అందించబడ్డాయి. 50MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీ ప్రేమికులకు పెద్ద ఆకర్షణగా నిలుస్తుంది.

వాబుల్ వన్‌లో 5000mAh బ్యాటరీని అందించారు. దీనిని ఒక్కసారి చార్జ్ చేస్తే 47 గంటల కాలింగ్, 24 గంటల వీడియో స్ట్రీమింగ్, 22 రోజుల స్టాండ్ బై లైఫ్‌ను అందిస్తుందని కంపెనీ ప్రకటించింది. తాజా ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడిచే ఈ ఫోన్ గూగుల్ AI ఫీచర్లను కలిగి ఉండటంతో పాటు No Bloatware ను అందిస్తుంది. కనెక్టివిటీ పరంగా ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3.5mm ఆడియో జాక్, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, USB Type-C 2.0, 5G SA/NSA వంటి ఆధునిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

Maoist Leader Hidma: పువర్తిలో విషాద ఛాయలు.. స్వగ్రామానికి చేరిన మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతదేహం..!

Wobble One మిథిక్ వైట్, ఎక్లిప్స్ బ్లాక్, ఒడిస్సీ బ్లూ అనే మూడు రంగుల్లో లభ్యం అవుతుంది. ఇక ధరల విషయానికి వస్తే 8GB + 128GB వేరియంట్ రూ. 22,000 గా నిర్ణయించబడింది. అలాగే 8GB+256GB, 12GB+256GB వేరియంట్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ స్మార్ట్‌ఫోన్ డిసెంబర్ 12 నుంచి అమెజాన్ తో పాటు ప్రధాన రిటైల్ స్టోర్లలో విక్రయానికి అందుబాటులోకి రానుంది.

Exit mobile version