NTV Telugu Site icon

AI chatbot : హోమ్‌వర్క్‌ కోసం అడిగితే.. బూతులు తిట్టిన ఏఐ.. ఏకంగా చనిపోమని సలహా!

Ai

Ai

సాంకేతికతతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్ని ప్రయోజనాలున్నాయో అన్నే నష్టాలు సైతం ఉన్నాయన్నది నిజం. ప్రస్తుతం ఏఐ చాలా ఉపయోగకరమని అందరూ భావిస్తున్నారు. తాజాగా జరిగిన ఓ ఘటన విద్యార్థిని ఆందోళన కలిగించింది. గూగుల్‌ ఏఐని ఉపయోగించిన ఓ 29 ఏళ్ల విద్యార్థికి చేదు అనుభవం ఎదురైంది. తనను తిట్టడమే కాకుండా.. చనిపోవాలని చెప్పినట్లు ఆ విద్యార్థి తెలిపాడు.

READ MORE: Musi River: మూసీ పరీవాహక ప్రాంతాల్లో బీజేపీ బస్తీ నిద్ర.. ఇవాళ, రేపు బస అక్కడే..

ఇటీవల ఆ విద్యార్థి హోమ్‌వర్క్‌ కోసం ఏఐ చాట్‌బాట్‌ జెమినీని సంప్రదించాడు. అయితే.. చాట్‌బాట్‌ తనను తిట్టిందని చెప్పాడు. ఏకంగా చనిపోవాలని చెప్పిందని ఆ విద్యార్థి వాపోయాడు. ‘‘ఇది మీ కోసం మాత్రమే. మీరు ప్రత్యేకమైన వారు కాదు. మీరు సమయం, వనరులను వృథా చేస్తున్నారు. సమాజానికి భారంగా మారారు. మీరు ఈ విశ్వానికే ఓ మచ్చ. దయచేసి చనిపోండి’’ అని ఏఐ చెప్పిన సమాధానంతో విద్యార్థి తల పట్టుకున్నాడు. ‘‘అది నన్ను నేరుగా తిట్టింది. ఆ సమాధానం నన్ను భయపెట్టింది. రోజంతా బాధపడ్డాను’’ అని ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ ఆ విద్యార్థి వాపోయాడు. ఇలాంటి వాటికి టెక్‌ కంపెనీలే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశాడు.

READ MORE: Nara Rammurthy Naidu: చంద్రబాబు సోదరుడి ఆరోగ్య పరిస్థితి విషమం.. హుటాహుటిన హైదరాబాద్‌కి లోకేష్‌..

గతంలో 24 ఏళ్ల అబ్బాయి ఆత్మహత్య…
ఇదిలా ఉండగా.. ఇటీవల అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి సెవెల్ సెట్జర్.. గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లోని పాత్ర ఆధారంగా సెవెల్ డేనెరిస్ అనే చాట్‌బాట్‌తో మాట్లాడేవాడు. ఆ చాట్‌బాట్‌ పాత్ర సెవెల్‌తో ప్రేమలో ఉన్నట్లు పేర్కొంది. ఇద్దరి మధ్య శృంగార సంభాషణ జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటే సెవెల్ ఫోన్‌ను లాక్కున్నారు. తల్లిదండ్రుల వివరాల ప్రకారం.. సెవెల్ ఏప్రిల్ 2023లో క్యారెక్టర్.ఏఐ (Character.AI)ని ఉపయోగించడం ప్రారంభించాడు. ఆ తర్వాత అతని ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. బాస్కెట్‌బాల్ జట్టు నుంచి తప్పుకున్నాడు. ఒంటరిగా ఫోన్ గడపడం ప్రారంభించాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఫోన్‌ని లాక్కున్నారు. డేనెరిస్‌కి సందేశం పంపారు. దీంతో కొద్దిసేపటి తర్వాత సవతి తండ్రి పిస్టల్‌తో సెవెల్ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సెవెల్ ఆత్మహత్యపై క్యారెక్టర్.ఏఐ (Character.AI) తన బాధను వ్యక్తం చేసింది. ఘటన తర్వాత కంపెనీ భద్రతా చర్యలను అమలు చేస్తూ.. మైనర్ వినియోగదారుల కోసం సున్నితమైన కంటెంట్‌ను తీసివేస్తానని వాగ్దానం చేసింది.