WhatsApp New Feature: వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. ఇక, ఎవరి బర్త్‌డేలు మిస్ కారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WhatsApp New Feature: వాట్సాప్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ తీసుకు వస్తూనే ఉంది.. ఇక, వినియోగదారుల అనుభవాన్ని మరింత మెరుగుపరిచేందుకు వాట్సాప్ కొత్త బర్త్‌డే రిమైండర్ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వారి రాబోయే పుట్టినరోజుల గురించి యాప్‌లోనే నోటిఫికేషన్లు అందుతాయి. దీంతో ప్రత్యేకంగా క్యాలెండర్ యాప్‌లను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు.
నివేదిక ప్రకారం, వాట్సాప్ ఇప్పటికే ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.24.12.25 అప్డేట్లో ఇలాంటి ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.. వాట్సాప్ కొంతమంది వినియోగదారుల నుండి పుట్టిన తేదీలను సేకరించడం ప్రారంభించింది. ఈ సమాచారం ఇతర వినియోగదారులకు కనిపించదని ఆ సంస్థ పేర్కొంది. ఒకసారి నమోదు చేసిన తర్వాత, పుట్టిన సంవత్సరాన్ని మార్చడం సాధ్యం కాదు. ప్రారంభంలో, ఈ డేటాను కేవలం చట్టపరమైన నిబంధనల పాటింపు కోసం మాత్రమే ఉపయోగించారు. అమెరికాలోని పలు రాష్ట్రాలు ఆన్లైన్ సేవలు తమ వినియోగదారుల వయస్సును ధృవీకరించాలని చట్టాలను అమలు చేశాయి.
Also Read
- Vivo V70 Lite 4G: వివో V70 Lite 4G వచ్చేసింది.. 8100mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
- OPPO Find X9s: సగం ధరకే ఒప్పో Find X9s.. 12GB RAM, 50MP కెమెరా, 7025mAh బ్యాటరీతో ప్రీమియం 5G ఫోన్
- Honor Turbo 5G: హానర్ టర్బో 5G విడుదల.. 8,560mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో కొత్త 5G ఫోన్
- 64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
ఇప్పటికే కొన్ని బీటా వెర్షన్లలో వాట్సాప్ వినియోగదారులను వారి పుట్టిన తేదీ, పుట్టిన సంవత్సరాన్ని నమోదు చేయమని కోరుతోంది. ప్రారంభంలో ఈ సమాచారం చట్టపరమైన నిబంధనల అమలు కోసం సేకరించినప్పటికీ, ఇప్పుడు అదే డేటాను బర్త్‌డే రిమైండర్ల కోసం వినియోగించనుంది. వాట్సాప్‌లో ప్రత్యేక ‘బర్త్‌డేస్’ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో వినియోగదారులు తమ కాంటాక్ట్‌ల రాబోయే పుట్టినరోజులను ఒకేచోట చూడగలుగుతారు. అయితే సంబంధిత వ్యక్తి తన పుట్టిన తేదీని వాట్సాప్‌లో నమోదు చేసినప్పుడే ఈ రిమైండర్లు కనిపిస్తాయి.
ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉంది. భవిష్యత్తులో దీనితో పాటు ప్రైవసీ నియంత్రణలు కూడా అందుబాటులోకి రానున్నాయి. వాటి ద్వారా వినియోగదారులు తమ పుట్టినరోజు వివరాలను ఎవరికి చూపించాలనేది స్వయంగా నిర్ణయించుకోవచ్చు. కాగా, ఇప్పటికే ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలో యాప్స్‌లో బర్త్‌డే రిమైండర్స్ ఉండగా.. ఇప్పుడు వాట్సాప్ కూడా దీనిని అమలు చేసేందుకు సన్నహాలు చేస్తోంది..
తాజావార్తలు
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!