WhatsApp: వాట్సాప్ ప్రైవసీపై మరో వివాదం.. ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు.. మెటా క్లారిటీ.!
- వాట్సాప్ ప్రైవసీపై కొత్త కోర్టు కేసు
- ఎలోన్ మస్క్ ఘాటు వ్యాఖ్యలతో వేడి పెరిగింది
- మెటా ఫిర్యాదులను ఖండిస్తూ క్లారిటీ ఇచ్చింది
- సైబర్ నిపుణులు యూజర్లకు ఇచ్చిన జాగ్రత్త సూచనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెటా యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ (WhatsApp) ప్రైవసీకి సంబంధించి ఒక సంచలన వార్త ఇప్పుడు టెక్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. వాట్సాప్ తన యూజర్ల మెసేజ్‌లను రహస్యంగా చదువుతోందని అమెరికా కోర్టులో దాఖలైన ఒక దావా కొత్త చర్చకు దారితీసింది. దీనిపై టెక్ కుబేరుడు ఎలాన్ మస్క్ తనదైన శైలిలో స్పందించడంతో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్న వాట్సాప్, తాము అందించే ప్రతి మెసేజ్ ‘ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్’ (End-to-End Encrypted) అని, అంటే పంపేవారు, స్వీకరించేవారు తప్ప మరెవరూ (చివరికి కంపెనీ కూడా) వాటిని చదవలేరని ఎప్పటినుంచో చెబుతోంది. అయితే, అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో కోర్టులో దాఖలైన తాజా దావా ఈ నమ్మకాన్ని ప్రశ్నిస్తోంది.
Also Read
- TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
- Samsung Galaxy A08: సామ్ సంగ్ Galaxy A08 భారత్‌లో లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
- Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
- Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
Chhattisgarh: 78 ఏళ్ల స్వాతంత్య్ర భారతం.. ఈ 47 గ్రామాల్లో తొలిసారి ఎగిరిన త్రివర్ణ పతాకం..
అమెరికా కోర్టులో దాఖలైన దావా ప్రకారం, వాట్సాప్ తన యూజర్లను మోసం చేస్తోందని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. వాట్సాప్ కేవలం మెసేజ్‌లను బట్వాడా చేయడమే కాకుండా, వాటిలోని కంటెంట్‌ను విశ్లేషించే సామర్థ్యాన్ని కలిగి ఉందని దావాలో ఆరోపించారు. యూజర్లు తమ స్నేహితులు , కుటుంబ సభ్యులతో చేసే ప్రైవేట్ చాట్‌ల ఆధారంగా వారికి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటనలు (Targeted Ads) చూపించేందుకు ఈ డేటాను మెటా వాడుకుంటోందని ఆరోపణలు వెల్లువెత్తాయి.
కంపెనీలో పనిచేసే కొంతమంది ఉద్యోగులకు యూజర్ల డేటాను యాక్సెస్ చేసే వెసులుబాటు ఉందని, ఇది యూజర్ల ప్రైవసీకి పెద్ద ముప్పు అని దావాలో స్పష్టం చేశారు. ఈ వార్తలపై ఎక్స్ (X – గతంలో ట్విట్టర్) వేదికగా ఎలాన్ మస్క్ తీవ్రంగా స్పందించారు. గతంలోనూ మెటా సంస్థపై విమర్శలు చేసే మస్క్, ఈసారి మరింత ఘాటుగా స్పందిస్తూ.. “వాట్సాప్ తన యూజర్ల డేటాను ప్రతిరోజూ రాత్రి ఎగుమతి చేస్తూనే ఉంటుంది. ఇది అస్సలు సురక్షితం కాదు” అని వ్యాఖ్యానించారు. మస్క్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా మంది యూజర్లు ఇప్పుడు వాట్సాప్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఆరోపణలను మెటా సంస్థ , వాట్సాప్ అధిపతి విల్ క్యాత్‌కార్ట్ తీవ్రంగా ఖండించారు. ఈ దావాలోని అంశాలు కేవలం అపోహలు మాత్రమేనని, వాట్సాప్ ఎప్పుడూ యూజర్ల ప్రైవసీని ఉల్లంఘించదని వారు స్పష్టం చేశారు. మెసేజ్ ఎన్‌క్రిప్షన్ కీలు కేవలం వినియోగదారుల పరికరాల్లోనే ఉంటాయని, కంపెనీ సర్వర్లలో కావాలన్నా మెసేజ్‌లను చదవడం అసాధ్యమని వాట్సాప్ ప్రతినిధులు వివరించారు. తప్పుడు ఆరోపణలతో కంపెనీ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని, దీనిపై తాము కోర్టులో ధీటుగా పోరాడతామని మెటా ప్రతినిధి ఆండీ స్టోన్ హెచ్చరించారు.
యూజర్లు ఏం చేయాలి?
- ఎన్‌క్రిప్టెడ్ బ్యాకప్స్: వాట్సాప్ సెట్టింగ్స్‌లో చాట్ బ్యాకప్‌లకు కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఆన్ చేసుకోవాలి.
- టూ-స్టెప్ వెరిఫికేషన్: అకౌంట్ భద్రత కోసం టూ-స్టెప్ వెరిఫికేషన్‌ను తప్పనిసరిగా వాడాలి.
- సున్నితమైన సమాచారం: బ్యాంకింగ్ వివరాలు లేదా అత్యంత వ్యక్తిగత పాస్‌వర్డ్స్ వంటివి చాట్‌లలో షేర్ చేయకుండా ఉండటం మంచిది.
ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉన్నందున, రాబోయే రోజుల్లో వాట్సాప్ ప్రైవసీకి సంబంధించి మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..