Site icon NTV Telugu

WhatsApp: వాట్సాప్‌లో మరో కొత్త అప్‌డేట్.. ఒకేసారి ఎక్కువమందితో చాటింగ్ చేసుకోవచ్చు

Whatsapp

Whatsapp

New Update in Whatsapp: ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త అప్‌డేట్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో గ్రూప్ అడ్మిన్‌లకు శుభవార్త అందింది. ఇప్పటివరకు వాట్సాప్ గ్రూప్‌లో 512 మందిని మాత్రమే యాడ్ చేసుకునే అవకాశం యూజర్లకు ఉండేది. అయితే ఇప్పుడు గ్రూప్‌లో ఉండే సభ్యుల సంఖ్యను వాట్సాప్ పెంచింది. కొత్త అప్‌డేట్ ప్రకారం ఒక గ్రూప్‌లో 1024 మందిని యాడ్ చేసుకోవచ్చు. అంటే గతంలో ఉండే సంఖ్యను వాట్సాప్ రెట్టింపు చేసింది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ రెండు ఆపరేటింగ్ సిస్టమ్‌లోనూ బీటా వెర్షన్‌లో ఇప్పటికే ఈ అప్‌డేట్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వాట్సాప్ వెల్లడించింది.

Read Also: T20 World Cup: అదరగొట్టిన బౌలర్లు.. తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియాదే విజయం

కాగా త్వరలో యూజర్లందరికీ ఈ అప్‌డేట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు గ్రూప్ అడ్మిన్‌ల కోసం వాట్సాప్ కొత్త అప్రూవల్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టనుంది. కొత్త ఫీచర్‌తో గ్రూప్‌లో చేరేందుకు అడ్మిన్ రిక్వెస్ట్ పంపిన వ్యక్తుల జాబితా పెండింగ్ పార్టిసిపెంట్స్‌గా కనిపిస్తుంది. వారిలో ఎవరినైతే గ్రూప్‌లో సభ్యులుగా చేర్చుకోవాలని భావిస్తే వారిని అనుమతిస్తే సరిపోతుంది. ఈ ఫీచర్‌తో ఎక్కువ మంది సభ్యులున్న గ్రూప్‌ నిర్వహణ సులభతరం అవుతుందని వాట్సాప్ భావిస్తోంది. గ్రూప్ సభ్యుల సంఖ్య పెరగడంతో ఎక్కువ మందితో చాటింగ్ చేసుకోవచ్చు. విలువైన సమాచారాన్ని కూడా షేర్ చేసుకునే అవకాశం లభిస్తుంది. కాగా త్వరలో యూజర్ ప్రైవసీ కోసం వ్యూవన్స్‌లో స్క్రీన్ షాట్ బ్లాక్ అనే మరో ముఖ్యమైన ఫీచర్‌ను కూడా వాట్సాప్ తీసుకురానుంది. అటు పోల్, అవతార్, ఎడిట్, వాయిస్ స్టేటస్ వంటి ఫీచర్లు కూడా వినియోగదారులకు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. అవతార్ ఫీచర్ కింద వినియోగదారులు తమ అవతార్‌ను సృష్టించుకోవచ్చు. స్నేహితులకు స్టిక్కర్లను పంపడమే కాకుండా ప్రొఫైల్ ఫోటోపై వారి అవతార్‌ను కూడా ఉంచవచ్చు.

Exit mobile version