NTV Telugu Site icon

Whatsapp New Features: వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్స్..ఆన్లైన్ ఆర్డర్స్ తో పాటు..

Whatsapp

Whatsapp

ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ తన కస్టమర్స్ కోసం అదిరిపోయే ఫీచర్స్ ను ఎప్పటికప్పుడు తీసుకొస్తున్నారు.. మెటా యాజమాన్యంలోని ప్రముఖ మెసెంజర్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మెసెజ్ పంపినంత సులభంగా ఆర్డర్లు, పేమెంట్లు చేసుకోవచ్చు.. తమ కస్టమర్లు కోసం షాపింగ్ ను మరింత సులభతరం ‘Flow’ అనే కొత్త ఫీచర్ తీసుకురానుంది. దీని ద్వారా వ్యాపారులతో పాటు వినియోగదారులు మల్టీ సర్వీసులను ఒకే చోట పొందనున్నారు. రాబోయే రోజుల్లో బిజినెస్ అకౌంట్ యూజర్ల కోసం అనేక కొత్త ఆప్షన్లు యాడ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. ఈ ఫీచర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..

ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ యాప్ నుంచి షాపింగ్, ఫుడ్ ఆర్డర్, అపాయిట్‌మెంట్ బుకింగ్ వంటి సేవలన్నో సులభంగా చేసుకోవచ్చు. బిజినెస్ అకౌంట్ల కోసం నిర్దిష్ట క్యాలెండర్లతో పాటు మరెన్నో ఆప్షన్లు రానున్నాయి.
వాట్సాప్ Flow ఫీచర్ కోసం సపోర్ట్ పేజీని క్రియేట్ చేసింది. అపాయిట్‌మెంట్, ఫారమ్ ఫిల్లింగ్, ప్రాడక్ట్ కస్టమైజేషన్ వంటి ఆప్షన్స్ ఎన్నో ఉన్నాయి. అతి త్వరలో వాట్సాప్ యూజర్లకు ఈ ఆప్షన్లన్నీ అందుబాటులోకి రానున్నాయి. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక ఇక పేమెంట్స్ కూడా ఇందులోనే చేసే వెసులుబాటు కూడా ఉంటుందని వాట్సాప్ ప్రతినిధులు చెబుతున్నారు..

ఇకపోతే వాట్సాప్ పేమెంట్స్ కోసం Razorpay, PayUతో ఒప్పందం కుదుర్చుకుంది. వీటి ద్వారా యూజర్లు క్షణాల్లో లావాదేవీలను పూర్తి చేయొచ్చు. ఇప్పటివరకు యూపిఐ ద్వారా చెల్లింపులు చేయడానికి యూజర్లు వాట్సాప్ పేని ఉపయోగించేవారు. అయితే ఇక నుంచి ఇతర UPI యాప్‌లు, క్రెడిట్, డెబిట్ కార్డుల నుంచి కూడా చెల్లింపులు సులభంగా చేయొచ్చని ప్రకటించారు.. వాట్సాప్ యాప్‌ను ఒక్క భారతదేశంలోనే సుమారు 50 కోట్లకు మంది వాడుతున్నారు.. వీరందరు కూడా వాట్సాప్ పేమెంట్స్ ను వాడేలా ప్రయత్నాలు చేస్తున్నారు..