WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇక మీ అకౌంట్‌కు డబుల్ ప్రొటెక్షన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WhatsApp New Security Feature: వాట్సాప్ వాడే కోట్లాది మంది వినియోగదారుల కోసం సంస్థ మరో కీలకమైన సెక్యూరిటీ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటివరకు ఖాతా భద్రత కోసం వాడుతున్న టూ-స్టెప్ వెరిఫికేషన్ విధానాన్ని మరింత పటిష్టం చేస్తూ ‘అకౌంట్ పాస్వర్డ్ ఫర్ టూ-స్టెప్ వెరిఫికేషన్’ అనే కొత్త ఫీచర్‌ను జోడించింది. వాట్సాప్ అప్డేట్స్ను నిశితంగా గమనించే ‘Wabetainfo’ ప్రకారం, ఈ కొత్త పాస్వర్డ్ ఫీచర్ త్వరలోనే ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు టూ-స్టెప్ వెరిఫికేషన్‌లో 6 అంకెల పిన్ (PIN) మాత్రమే వాడేవాళ్ళం. కానీ కొత్త అప్డేట్తో కేవలం అంకెలకే పరిమితం కాకుండా, ఒక బలమైన పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. దీనివల్ల ఖాతాకు అదనపు రక్షణ లభించి హ్యాకింగ్ ముప్పు తగ్గుతుంది. SMS ద్వారా వచ్చే 6 అంకెల కోడ్‌ను నమోదు చేసిన తర్వాత, ఈ కొత్త పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
ఈ సెక్యూరిటీని యాక్టివేట్ చేసుకోవడానికి వాట్సాప్‌లోని Settings లోకి వెళ్లి, Account విభాగంలోకి వెళ్తే ‘అకౌంట్ పాస్వర్డ్’ సెట్ చేసుకునే ఆప్షన్ కనిపిస్తుంది. ఇప్పటికే టూ-స్టెప్ వెరిఫికేషన్ ఉపయోగిస్తున్న వారు ఈ ఫీచర్ రాగానే తమ పాత PIN స్థానంలో కొత్త పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకోవాల్సి రావచ్చు. అయితే ఈ పాస్వర్డ్ సెట్ చేసుకోవడానికి వాట్సాప్ ఒక ముఖ్యమైన నిబంధన పెట్టింది. సాధారణ పిన్ నంబర్లలా కాకుండా, ఖాతాదారులు కనీసం 8 అక్షరాలు (క్యారెక్టర్లు) ఉండేలా ఒక స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌ను డిజైన్ చేసుకోవాలి. ఒకవేళ ఎప్పుడైనా ఈ పాస్వర్డ్ మరచిపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ ఇమెయిల్ ఐడీ సహాయంతో సులభంగా రీసెట్ చేసుకోవచ్చు. మీరు రీసెట్ ఆప్షన్ ఎంచుకోగానే ఇమెయిల్‌కు ఒక లింక్ వస్తుంది, దాని ద్వారా కొత్త పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకోవచ్చు.
Also Read
- Lenovo ThinkBook 14x: లెనోవా ThinkBook 14x వచ్చేసింది.. 120Hz OLED డిస్ప్లే, Core Ultra ప్రాసెసర్
- Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
- Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
- IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
తాజావార్తలు
-
Ram Gopal Varma: “ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది”.. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Explainer: రణక్షేత్రాన్ని తలపిస్తోన్న ఢిల్లీ..అక్టోబర్ 10న ఏం జరగనుంది?
-
Deputy CM Pawan Kalyan: పోలవరం పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
Nana Patekar: క్రికెట్ అంటే నానాకు పిచ్చి.. విరాట్ అవుటైతే అన్నం కూడా తినేవారు కాదట..!
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!