మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్స్ వరుస గుడ్ న్యూస్ లు చెబుతుంది.. ఈమేరకు ఇప్పుడు మరో ఐదు ఫీచర్స్ ను అందిస్తుంది.. కస్టమర్స్ సేఫ్టీ కోసం కొత్త ఫీచర్లు, అప్ డేట్లు తీసుకొస్తోంది. అందుకే అంతలా జనాల్లో ఈ వాట్సాప్ కు ఆదరణ ఉంది. ఇప్పుడు కూడా పలు కొత్త ఫీచర్లను తీసుకొచ్చేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. ఇప్పటికే ఐదు కొత్త ఫీచర్లను లైన్ లో ఉంచినట్లు సమాచారం. వాట్సాప్ ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చే లక్ష్యంతో ఈ ఐదు కొత్త ఫీచర్లను తీసుకురానున్నట్లు తెలుస్తుంది.. సీక్రెట్ కోడ్, కొత్త చాట్ అటాచ్ మెంట్, అప్ డేట్ ట్యాబ్ లో కొత్తగా సెర్చ్ బటన్, పిన్డ్ మెసేజ్, ఐపీ అడ్రస్ ను సంరక్షించాడానికి ప్రైవసీ ప్రొటెక్ట్ వంటి ఫీచర్లను తీసుకురానుంది.. అయితే ఇప్పటివరకు ఈ ఫీచర్స్ కేవలం కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉన్నాయి.. మరికొన్ని వారాల్లో ఆ ఫీచర్స్ అందుబాటులోకి రానున్నాయి.. మరి ఆ ఫీచర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…
సీక్రెట్ కోడ్.. ఈ ఫీచర్ ఫోన్ ప్రధాన పాస్‌వర్డ్ వలే వేరే పాస్ వర్డ్ ఉంటుంది. దీని సాయంతో వినియోగదారుల చాట్ లు మరింత భద్రంగా ఉంటాయి. లాక్ చేసిన చాట్ లు ప్రత్యేకంగా ఉంటాయి. అవి మరో వ్యక్తి ఓపెన్ కావు. మీరు ఏర్పాటు చేసుకున్న పాస్ వర్డ్ పిన్ లేదా బయోమెట్రిక్ లతోనే చాట్ ఓపెన్ అవుతుంది..
సెర్చ్ ఫీచర్ ఫర్ అప్ డేట్స్.. వాట్సాప్ యాప్ పై భాగంలో సెర్చ్ బటన్ అందుబాటులో ఉండవచ్చు. దీని వలన స్టేటస్ అప్‌డేట్‌లు, ఫాలో అయ్యే ఛానెల్‌లు, ఏది కావాలంటే అది సెర్చ్ చేసుకొనే వెసులబాటు ఉంటుంది..
పిన్డ్ మెసేజ్.. మీరు కోరుకున్న చాట్ ను పిన్ చేసి హైలేట్ చేసుకొనే అవకాశం ఈ ఫీచర్ ద్వారా కలుగుతుంది. మిగిలిన చాట్ లకన్నా ఈ హైలైట్ అయిన చాట్ పైభాగంలో కనిపిస్తుంది. మీరు ఎక్కువగా చాట్ చేసే వారిని ఇలా పిన్ చేసుకోవచ్చు..
సెర్చ్ ఫీచర్..వాట్సప్ లో పైన సెర్చ్ బార్ లో సెర్చ్ బటన్ అందుబాటులోకి రానుంది. ఈ సెర్చ్ బటన్ తో స్టేటస్ అప్ డేట్ లు, ఫాలో అయ్యే చానళ్లు, ఇతర వెరిఫై చేయబడిన చానల్లు వెతకడం కోసం ఈ ఫీచర్ సహాయ పడుతుంది.ఈ సరికొత్త ఫీచర్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో వాట్సప్ తెలపలేదు కానీ ఈ ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయంటే వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని వాట్సాప్ క్రియేటర్స్ చెబుతున్నారు..