WhatsApp: వాట్సాప్‌లో మరో సూపర్ ఫీచర్..ప్రొఫైల్ ను సేఫ్టీగా ఉంచుతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.. యూజర్ల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చే వాట్సాప్ అందుకు అనుగుణంగా ఎన్నో సెక్యూరిటీ ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.. తాజాగా మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది.. ఆ ఫీచర్ తో మనం ప్రొఫైల్ మరింత సేఫ్టీగా ఉంటుంది.. ఆ ఫీచర్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
మీ ప్రొఫెల్ ఫొటోలు, స్టేటస్లు విషయంలో పలు ప్రైవసీ ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. అన్నోన్ నెంబర్స్, మీ కాంటాక్ట్‌లో సేవ్‌లేని నెంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ రింగ్ కాకుండా సైలెన్స్ చేసుకునే సదుపాయాన్ని గతంలో తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫీచర్‌కు యూజర్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా, తాజాగా ఈ ఫీచర్‌కు కొనసాగింపుగా వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.
Also Read
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
- Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
- 200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
మీ ఫోన్ ఐపీ అడ్రస్, లొకేషన్ ప్రొటెక్షన్,ఆడియో కాల్స్, వీడియో కాల్స్ చేసినా లొకేషన్, ఐపీ అడ్రస్ వంటి వివరాలు అవతలి వ్యక్తులకు తెలియకుండా చేసుకోవచ్చు.. ఈ ఫీచర్ ను యాక్టివేట్ చేసుకోవాలంటే.. ముందుగా వాట్సాప్ యాప్ ఓపెన్ చేయాలి. అనంతరం కుడివైపు త్రీ డాట్స్ మెనూలోని ప్రైవసీలోకి వెళ్లాలి. అనంతరం అక్కడ ఉన్న అడ్వాన్స్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్ అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. దీంతో మీరు ఎక్కడుండి ఫోన్ మాట్లాడుతున్నారన్న విషయాన్ని అవతలి వ్యక్తి తెలుసుకునే అవకాశం ఉండదు. అయితే ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవడం వల్ల కాల్ క్వాలిటీ కొంత తగ్గుతుందని చెబుతున్నారు.. ఈ కొత్త ఫీచర్ ఆండ్రాయిడ్ తో పాటు ఐఓస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు. మరెందుకు ఆలస్యం మీకు కూడా ఈ కొత్త ఫీచర్ వచ్చేందేమో చెక్ చేసుకొని యాక్టివేట్ చేసుకోండి… రాకుంటే వాట్సాప్ ను వెంటనే అప్డేట్ చేసుకోండి.. అప్పుడే ఈ ఫీచర్ ను మీరు ఉపయోగించుకోవచ్చు..
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!