WhatsApp: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్.. ఉన్నపళంగా సస్పెండ్ అవుతున్న అకౌంట్లు.. ఎందుకంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) ప్రపంచవ్యాప్తంగా పలువురు వినియోగదారుల ఖాతాలను ఉన్నపళంగా సస్పెండ్ చేస్తూ 24 గంటల సమీక్ష (Under Review) పరిధిలోకి తీసుకురావడం తీవ్ర కలకలం రేపింది. భారత్‌తో సహా పలు దేశాల్లోని వినియోగదారులు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే సోమవారం రాత్రి (ఆగస్టు 3) 8 గంటల ప్రాంతంలో తమ వాట్సాప్ ఖాతాలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాట్సాప్ ఓపెన్ చేయగానే “Account in review” అని చూపిస్తూ, నిబంధనలను ఉల్లంఘించారో లేదో నిర్ధారించుకోవడానికి ఖాతా కార్యకలాపాలు, డివైజ్ సమాచారాన్ని పరిశీలిస్తున్నామని, 24 గంటల్లో ఫలితాన్ని తెలియజేస్తామని స్క్రీన్‌పై ప్రత్యక్షమైంది.
అధికారిక యాప్‌లను ఉపయోగిస్తున్నప్పటికీ, ఎలాంటి కారణం లేకుండా ఖాతాలు నిలిపివేయడంతో వృత్తిపరమైన పనులకు ఇబ్బంది కలిగిందని బాధితులు ఎక్స్ (ట్విట్టర్), థ్రెడ్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సాంకేతిక లోపంపై వాట్సాప్ యజమాన్య సంస్థ మెటా (Meta) స్పందించింది. ఆటోమేటెడ్ సెక్యూరిటీ సిస్టమ్ (స్పామ్, దుర్వినియోగాన్ని అడ్డుకునే వ్యవస్థ) లోపం కారణంగానే నిజమైన వినియోగదారుల ఖాతాలు కూడా పొరపాటున ఫ్లాగ్ అయ్యాయని వివరణ ఇచ్చింది. “మేము వాట్సాప్ దుర్వినియోగానికి గురికాకుండా చూసేందుకు, వినియోగదారుల రక్షణ కోసం నిరంతరం పనిచేస్తుంటాం. ఈ క్రమంలో కొన్నిసార్లు అల్గారిథమ్ తప్పులు జరుగుతుంటాయి. అలాంటి లోపాలు జరిగినప్పుడు వీలైనంత త్వరగా సరిదిద్ది వినియోగదారులకు సేవలను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తాం” అని వాట్సాప్ అధికార ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం బాధితుల ఖాతాలను తిరిగి పునరుద్ధరించే ప్రక్రియను కంపెనీ చేపట్టింది.
Also Read
- BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
- Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
- Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా!
- TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!