Vivo Y500i: వివో సంస్థ చైనాలో Vivo Y500i స్మార్ట్‌ఫోన్‌ను సైలెంట్ గా విడుదల చేసింది. వివో అధికారిక వెబ్‌సైట్‌లోని ప్రత్యేక మైక్రోసైట్ ద్వారా ఈ ఫోన్ లాంచ్ అయినట్టు వెల్లడైంది. ప్రస్తుతం ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ వివో ఆన్లైన్ స్టోర్ ద్వారా విక్రయానికి అందుబాటులో ఉంది. గెలాక్సీ సిల్వర్, ఫీనిక్స్ వెల్కమ్స్ గోల్డ్, అబ్సిడియన్ బ్లాక్ అనే మూడు రంగుల్లో ఈ హ్యాండ్‌సెట్‌ను తీసుకొచ్చారు. కాగా, వివో Y500i మొత్తం ఐదు ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ మందం 8.39 మిల్లీమీటర్లు ఉండగా, దీని బరువు సుమారు 219 గ్రాములు ఉంటుంది. ఇందులో భారీ 7,200mAh బ్యాటరీతో పాటు క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ పని చేయనుంది.
Read Also: Vivo X200T Launch: 6200mAh బ్యాటరీ, 50MP సోనీ-శాంసంగ్ కెమెరా.. ‘వివో ఎక్స్200’ కొత్త లీక్స్ ఇవే!
ఇక, వివో Y500i డ్యుయల్ సిమ్ సపోర్ట్‌తో వస్తుంది. ఇది Android 16 ఆధారిత OriginOS 6పై పని చేస్తుంది. ఈ ఫోన్లో 6.75 అంగుళాల LCD డిస్ప్లేను అందించారు. దీనికి 720×1570 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 19.6:9 ఆస్పెక్ట్ రేషియో, 90.6 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో ఉన్నాయి. ప్రాసెసింగ్ కోసం 4nm టెక్నాలజీపై తయారైన స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇందులో 2.2GHz వేగంతో పని చేసే రెండు పెర్ఫార్మెన్స్ కోర్లు, 1.95GHz క్లాక్ స్పీడ్‌తో ఆరు ఎఫిషియెన్సీ కోర్లు ఉన్నాయి. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 613 GPUను అందించారు.
Read Also: Ahmedabad: పతంగుల పండుగలో సందడి చేసిన మోడీ, ఛాన్సలర్ మెర్జ్
అయితే, కెమెరాల విషయానికి వస్తే, వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ సింగిల్ రియర్ కెమెరా ఉంది. దీనికి f/1.8 అపర్చర్, ఆటోఫోకస్, 10x డిజిటల్ జూమ్ సపోర్ట్ లభిస్తుంది. ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ కెమెరాను ఇచ్చారు. ఈ ఫోన్ ద్వారా 1080p వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అందించారు. అదనంగా IP68, IP69 రేటింగ్‌లతో నీరు, ధూళి నుంచి రక్షణ కల్పించారు. బ్యాటరీగా 7,200mAh సామర్థ్యం గల బ్యాటరీని ఇచ్చి, 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించారు. అలాగే, కనెక్టివిటీ కోసం 5G, 4G LTE, డ్యుయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 4.2, USB టైప్-C పోర్ట్, GPS, BeiDou, GLONASS, Galileo, QZSS వంటి ఫీచర్లు ఉన్నాయి. యాక్సిలరోమీటర్, అంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ-కంపాస్, ఇన్ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్ లాంటి సెన్సార్లను కూడా ఇందులో పొందుపరిచారు.
ఈ ఫోన్ మూడు రంగుల్లో..
* గెలాక్సీ సిల్వర్
* ఫీనిక్స్ వెల్కమ్స్ గోల్డ్
* అబ్సిడియన్ బ్లాక్
RAM & స్టోరేజ్ వేరియంట్స్..
* 8GB RAM + 128GB స్టోరేజ్: CNY 1,499 (~రూ.19,000)
* 8GB RAM + 256GB: CNY 1,799 (~రూ.23,000)
* 8GB RAM + 512GB: CNY 1,999 (~రూ.26,000)
* 12GB RAM + 256GB: CNY 1,999 (~రూ.26,000)
* 12GB RAM + 512GB: CNY 2,199 (~రూ.28,000)
డిస్ప్లే & సిస్టమ్
* 6.75 అంగుళాల LCD డిస్ప్లే
* రిజల్యూషన్: 720×1570 పిక్సెల్స్
* రిఫ్రెష్ రేట్: 120Hz
* ఆస్పెక్ట్ రేషియో: 19.6:9
* స్క్రీన్-టు-బాడీ రేషియో: 90.6%
* OS: Android 16 ఆధారిత OriginOS 6
కెమెరా ఫీచర్లు
* బ్యాక్ సైడ్: 50MP సింగిల్ రియర్ కెమెరా, f/1.8 అపర్చర్, 10x డిజిటల్ జూమ్, ఆటోఫోకస్
* సెల్పీ: 5MP ఫ్రంట్ కెమెరా, f/2.2 అపర్చర్
* వీడియో రికార్డింగ్: 1080p
భద్రత & బాడీ
* సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్
* IP68 + IP69 రేటింగ్‌లు (నీరు & ధూళి రక్షణ)
* డిమెన్షన్స్: 166.64×78.43×8.39mm
కనెక్టివిటీ & సెన్సార్లు
* 5G, 4G LTE, డ్యుయల్ బ్యాండ్ Wi-Fi, Bluetooth 4.2, USB Type-C
* GPS, BeiDou, GLONASS, Galileo, QZSS
* సెన్సార్లు: Accelerometer, Ambient Light Sensor, Proximity Sensor, E-Compass, Infrared Remote Control
చార్జింగ్ & బ్యాటరీ
* 7,200mAh బ్యాటరీ
* 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
