Site icon NTV Telugu

8200mAh భారీ బ్యాటరీ, IP69+ సర్టిఫికేషన్ తో విడుదలకు సిద్దమైన Vivo Y500

Vivo Y500

Vivo Y500

Vivo Y500: వివో తన కొత్త స్మార్ట్‌ఫోన్ Y500ను చైనాలో సెప్టెంబర్ 1న అధికారికంగా లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది. గతేడాది విడుదలైన Y300 కు ఇది అప్డేటెడ్ మోడల్. అయితే ఈ సారి వివో ఏనగా 8200mAh భారీ బ్యాటరీని అందిస్తోంది. ఇది Y300లోని 6500mAh కంటే చాలా ఎక్కువ. కంపెనీ ప్రకారం ఇది ఇప్పటివరకు వివో చరిత్రలో అత్యంత ఎక్కువ బ్యాటరీ లైఫ్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌గా ఇది నిలుస్తుందని తెలిపింది.

Bandi Sanjay : “No Ram, No Ramayana”అని సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసింది కాంగ్రెస్సే

ఇక ఈ ఫోన్‌లో IP69+/IP69/IP68 వాటర్‌ప్రూఫ్ సర్టిఫికేషన్లు కూడా ఉన్నాయి. ఇది వివో చరిత్రలోనే మంచి వాటర్‌ప్రూఫ్ రక్షణ అని కంపెనీ చెబుతోంది. అంతేకాకుండా ఈ మొబైల్ కు SGS గోల్డ్ లేబుల్ ఫైవ్‌స్టార్ డ్రాప్, ఇంపాక్ట్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ తో పాటు మిలిటరీ-స్టాండర్డ్ ఎన్విరాన్‌మెంటల్ టెస్టింగ్ లో కూడా ఈ ఫోన్ విజయవంతమైనాట్లు కంపెనీ తెలిపింది. ఇక ఈ మొబైల్ టీజర్ ఇమేజ్ ప్రకారం, ఈ ఫోన్‌లో పంచ్-హోల్ డిస్‌ప్లే, వెనుక భాగంలో రింగ్ LED ఫ్లాష్‌తో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. కలర్ ఆప్షన్లలో బ్లాక్, బ్లూ, వైలెట్ అందుబాటులో ఉండనున్నాయి.

coconut auction ₹5.71 lakhs: కొబ్బరికాయకు రూ.5.71లక్షలు.. ఇది మామూలు టెంకాయ కాదు

అందిన (లీకైన) సమాచారం ప్రకారం vivo Y500లో MediaTek Dimensity 7300 ప్రాసెసర్ ఉండనుంది. ఇది గత మోడల్‌లో ఉన్న Dimensity 6300 కంటే ఇది మెరుగైనదిగా భావిస్తున్నారు. ఫోన్‌లో FHD+ 120Hz OLED స్క్రీన్, వెనుక భాగంలో 50MP ప్రైమరీ కెమెరా + సెకండరీ కెమెరా, ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా లభించనున్నాయి. మొత్తం మీద, vivo Y500 బ్యాటరీ సామర్థ్యం, వాటర్‌ప్రూఫ్ ప్రొటెక్షన్, డ్రాప్ రెసిస్టెన్స్ వంటి విభాగాల్లో కంపెనీకి కొత్త మైలురాయిగా నిలుస్తుంది. సెప్టెంబర్ 1న లాంచ్ అయిన తర్వాత మరిన్ని స్పెసిఫికేషన్లు, ధర వివరాలు బయటకు రానున్నాయి.

Exit mobile version