50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
- వివో X500 సిరీస్‌లో భాగంగా vivo X500 Pro స్మార్ట్‌ఫోన్ లాంచ్
- 6.36 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, 8T LTPO టెక్నాలజీ
- 2nm MediaTek Dimensity 9600 Pro ప్రాసెసర్, Mali-G2-Ultra-NX GPU
- 50MP ప్రధాన కెమెరాతో పాటు 50MP అల్ట్రా-వైడ్, 50MP Zeiss APO పెరిస్కోప్ టెలిఫొటో కెమెరాలు
- 6,510mAh బ్యాటరీ, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్లెస్ ఛార్జింగ్
- IP68 + IP69 రేటింగ్‌లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VIVO X500 Pro: వివో నుండి X500 సిరీస్‌లో భాగంగా వివో X500 ప్రో (vivo X500 Pro) స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఫ్లాగ్షిప్ సెగ్మెంట్లో వచ్చిన ఈ ఫోన్లో 1.5K రిజల్యూషన్ డిస్ప్లే, MediaTek Dimensity 9600 Pro ప్రాసెసర్, Zeiss కెమెరా సిస్టమ్, 6,510mAh భారీ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.
1.5K 144Hz LTPO డిస్ప్లే
ఈ కొత్త స్మార్ట్ ఫోన్ లో 6.36 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లేను అందించారు. ఇది 2750×1260 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో, 8T LTPO టెక్నాలజీపై పనిచేస్తుంది. 1Hz నుంచి 144Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. Q11 లూమినెంట్ మెటీరియల్‌తో తయారు చేసిన ఈ స్క్రీన్ 4,500 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్, HDR10+, డాల్బీ విజన్ సపోర్ట్‌ను కలిగి ఉంది. అలాగే హార్డ్‌వేర్ స్థాయిలో 1 నిట్ వరకు కనిష్ఠ బ్రైట్నెస్, సర్క్యులర్ పోలరైజేషన్ 2.0, అడాప్టివ్ డిమ్మింగ్, SGS లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Also Read
- 200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
- 144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
- ఇండియాలో అడుగుపెడుతున్న Apple Pay .. ఫోన్‌పే, జీపేల కథ ఏంటి ?
- Lava Virat Curve 5G: లావా Virat Curve 5G వచ్చేసింది.. 50MP కెమెరా, Dimensity 7100, 6000mAh బ్యాటరీ
Dimensity 9600 Pro ప్రాసెసర్
వివో X500 ప్రో మొబైల్లో MediaTek Dimensity 9600 Pro ఫ్లాగ్షిప్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది 2nm ప్రాసెస్‌పై తయారైంది. Mali-G2-Ultra-NX GPUతో కలిసి పనిచేస్తుంది. 12GB లేదా 16GB LPDDR5X Ultra RAMతో పాటు 256GB, 512GB, 1TB UFS 4.1 స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 17 ఆధారిత OriginOS 7తో పనిచేస్తుంది. అడ్వాన్స్డ్ ఫొటోగ్రఫీ, మల్టీ-ఫ్రేమ్ ప్రాసెసింగ్, ట్రాకింగ్ వంటి పనుల కోసం వివోకు చెందిన ఇమేజింగ్, ట్రాకింగ్ ఇంజిన్లను కూడా ఇందులో అందించారు.
50MP Zeiss కెమెరాలు
ఫొటోగ్రఫీ కోసం ఇందులో 50MP ప్రధాన కెమెరాను అందించారు. 1/1.28 అంగుళాల బ్లూప్రింట్ 900 సెన్సార్, f/1.57 అపెర్చర్, OISతో ఇది పనిచేస్తుంది. VCS 4.0 స్పెక్ట్రల్ టెక్నాలజీ, Zeiss T* కోటింగ్, డీప్ అబ్జార్ప్షన్ బ్లూ గ్లాస్ వంటి టెక్నాలజీలు ఇందులో ఉన్నాయి. దీంతో పాటు 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, 50MP Sony LYTIA 610 Zeiss APO పెరిస్కోప్ టెలిఫొటో కెమెరా ఉన్నాయి. టెలిఫొటో కెమెరా 3.5x ఆప్టికల్ జూమ్, OIS, టెలిఫొటో మాక్రోకు సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఉంది.
6,510mAh బ్యాటరీ
వివో X500 ప్రోలో 6,510mAh బ్యాటరీని అందించారు. ఇది 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. ఈ ఫోన్‌కు IP68, IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌లు ఉన్నాయి. ఇన్-డిస్ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు, Hi-Fi ఆడియో, NFC వంటి ఫీచర్లు ఉన్నాయి.
ధర ఎంత?
ఈ మొబైల్ సన్నీ డే, సన్ సెట్ గ్లో, నైట్ ఫోటోగ్రఫీ, ఎర్త్ ఎకో అనే 4 కలర్ ఆప్షన్లలో ఇది లభిస్తుంది. వీటి ప్రీ-సేల్స్ సెప్టెంబర్ 21 నుంచి మొదలు కాగా.. సెప్టెంబర్ 29 నుంచి సాధారణ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. చైనాలో vivo X500 Pro ధరలు ఇలా ఉన్నాయి..
* 12GB + 256GB: 6,499 యువాన్ (సుమారు రూ.92,970).
* 12GB + 512GB: 7,499 యువాన్ (సుమారు రూ.1,07,275).
* 12GB + 1TB: 8,499 యువాన్ (సుమారు రూ.1,21,580).
తాజావార్తలు
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
US-Iran Conflict: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా బిగ్ షాక్.. సెప్టెంబర్ 23 నుంచి పూర్తిగా బంద్?
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: ఆ రెండు డెడ్లీ అండ్ రేర్ కాంబో.. అందుకే వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోతున్నాడు!
-
Movie Ticket Rates Hikes : పెంచిన సినిమా టిక్కెట్ రేట్లపై ఫైర్ అవుతున్న కామన్ ఆడియన్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!