Site icon NTV Telugu

100x జూమ్ నుంచి 6200mAh బ్యాటరీ వరకు.. స్మార్ట్ ధరలో ఫ్లాగ్‌షిప్ అనుభవం.. నేడే vivo X200T లాంచ్..!

Vivo X200t

Vivo X200t

vivo X200T launch: టెక్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఎందుకంటే అల్ ఇన్ వన్ మొబైల్ vivo X200T స్మార్ట్ ఫోన్ నేడు లాంచ్ కాబోతోంది కాబట్టి. ఈ మొబైల్ (vivo X200T) ఎలాంటి రాజీ లేకుండా పూర్తి ఆల్‌రౌండ్ అనుభవాన్ని అందించేలా డిజైన్ చేశారు. ZEISS పవర్డ్ కెమెరా సిస్టమ్, పని సులభం చేసే AI టూల్స్, రోజంతా నమ్మకంగా నిలిచే ఫ్లాగ్‌షిప్ స్థాయి పనితీరు.. ఇవన్నీ కలిసిన ఒక ప్యాకేజ్ తో మొబైల్ రానుంది.

Range Rover Sentinel: గణతంత్ర వేడుకల్లో ఆకర్షణగా నిలిచిన ప్రధాని కారు.. ఇది కదిలే భద్రతా కోట!

vivo X200Tలో మొదటగా చెప్పుకోవాల్సింది దీని కెమెరా సిస్టమ్. ఇది 50MP ZEISS సూపర్ టెలిఫోటో కెమెరా కలిగిన ఏకైక స్మార్ట్‌ఫోన్. దీనితో పాటు 50MP ZEISS మెయిన్ కెమెరా, 50MP ZEISS అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. ఇవి మూడు వేర్వేరు లెన్స్‌లు కాదు.. ఒకే పూర్తి ఇమేజింగ్ సిస్టమ్‌లా పనిచేస్తాయి. ZEISSతో కలిసి Urban Ecological Zones‌కు అనుగుణంగా ట్యూన్ చేయడం వల్ల ఈ కెమెరా నగర పరిసరాల్లో అద్భుతంగా పనిచేస్తుంది. 100x వరకు జూమ్ చేసి దూరంలోని డీటెయిల్స్‌ను దగ్గరకు తెచ్చుకోవచ్చు.

ఇందులో Dimensity 9400+ ఫ్లాగ్‌షిప్ చిప్ ఉంది. హెవీ మల్టీటాస్కింగ్, గేమింగ్, కంటెంట్ క్రియేషన్ అన్ని సజావుగా చేసుకోవచ్చు. 3,000,000+ AnTuTu స్కోర్‌తో దీర్ఘకాలం నమ్మకమైన పనితీరు అందిస్తుంది. 6200mAh పెద్ద బ్యాటరీ రోజంతా పని చేసుకొనేందుకు వీలుగా ఉంటుంది. 90W ఫ్లాష్‌చార్జ్, 40W వైర్‌లెస్ ఫ్లాష్‌చార్జ్‌తో తక్కువ సమయంలోనే బ్యాటిరిని ఛార్జ్ చేసుకోవచ్చు. అడ్వాన్స్‌డ్ కూలింగ్ సిస్టమ్ వల్ల ఎక్కువసేపు వాడినా ఫోన్ కంఫర్టబుల్‌గా ఉంటుంది. IP68, IP69 వాటర్ & డస్ట్ రెసిస్టెన్స్‌తో రోజువారీ అనుకోని పరిస్థితులకూ భయపడాల్సిన అవసరం లేదు.

Director Anil Ravipudi : నెక్స్ట్ ప్రాజెక్ట్ క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి

OriginOSపై నడిచే మొబైల్ మీ పని మరింత సులభంగా చేయడమే లక్ష్యంగా రూపొందింది. ఇంకా వివో ఆఫీస్ కిట్ ద్వారా ఫోన్, పీసీ మధ్య గ్యాప్ తగ్గుతుంది. ఫోన్‌ను పీసీపై మిరర్ చేసి రియల్‌టైమ్‌లో కంట్రోల్ చేయవచ్చు. కేబుల్స్ లేకుండా ఫైల్స్ ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. నోట్స్ అన్ని డివైస్‌ల్లో సింక్ అవుతాయి. ఇంకా, vivo X200Tకు 5 ఏళ్ల స్మూత్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేషన్ ఉంది. 5 సంవత్సరాల OS అప్‌డేట్స్, 7 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌తో దీర్ఘకాల భరోసా ఇస్తుంది.

Exit mobile version