vivo X200T Launch: వివో (vivo) లోని X200 సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ vivo X200Tను భారత మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ చేసింది. ప్రీమియం డిజైన్, పవర్‌ఫుల్ డిమెంసిటీ 9400+ చిప్, ZEISS కెమెరాలు, భారీ బ్యాటరీతో ఈ ఫోన్ ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌లో గట్టిపోటీ ఇవ్వనుంది. మరి ఈ ఫ్లాగ్ షిప్ మొబైల్ మొత్తం ఫీచర్స్ పై ఒక లుక్ వేద్దామా..
డిస్‌ప్లే & పనితీరు:
వివో X200Tలో 6.67 ఇంచుల 1.5K AMOLED డిస్‌ప్లేను అందించగా.. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 2160Hz PWM డిమ్మింగ్ తో వస్తోంది. ఇక ఫోన్‌కు ప్రాసెసర్ గా 3nm టెక్నాలజీపై ఆధారిత మీడియాటెక్ డిమెంసిటీ 9400+ ప్రాసెసర్ ఉంది. గేమింగ్, హెవీ మల్టీటాస్కింగ్ కోసం 4500mm² VC కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఇది 12GB / 16GB LPDDR5X ర్యామ్, 256GB / 512GB UFS 3.1 స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.
Groom Becomes Father: శోభనం రాత్రే తండ్రైన పెళ్లికొడుకు.. ఎలాగంటే..?
ZEISS కెమెరాలతో ఫోటోగ్రఫీ ఫీచర్స్:
* 50MP Sony IMX921 మెయిన్ కెమెరా (OISతో)
* 50MP అల్ట్రా వైడ్ కెమెరా (JN1 సెన్సార్)
* 50MP IMX882 పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా (3x ఆప్టికల్ జూమ్, 70mm ఫోకల్ లెంగ్త్)
* 100x HyperZoom సపోర్ట్, ZEISS ఆప్టిక్స్
* 32MP ఫ్రంట్ కెమెరా
* ఈ కెమెరాలు 4K వీడియో రికార్డింగ్‌కూ సపోర్ట్ చేస్తాయి.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6తో వస్తుంది. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే.. ఈ మొబైల్ కు 5 సంవత్సరాల Android OS అప్‌డేట్స్, 7 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందనున్నాయి.
బ్యాటరీ, డిజైన్ & ప్రొటెక్షన్:
వివో X200Tలో 6200mAh భారీ బ్యాటరీ ఉంది. ఇందులో 90W ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సప్పోర్ట్ లభిస్తుంది. మెటల్ ఫ్రేమ్‌తో వచ్చిన ఈ ఫోన్‌కు IP68 + IP69 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్ ఉంది. అలాగే దీనికి ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, NFC వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
స్టైలిష్ డిజైన్, హైబ్రిడ్ ఇంజిన్, ADAS ఫీచర్లతో 2026 Renault Duster వచ్చేసింది.. ఫీచర్స్ ఇవే..!
ధర:
ఈ ఫోన్ సీసైడ్ లిలక్, స్టెల్లార్ బ్లాక్ అనే రెండు రంగుల్లో అందుబాటులో ఉంది. ఇక ధరల విషయానికి వస్తే 12GB + 256GB వేరియంట్ రూ. 59,999 కాగా, 12GB + 512GB వేరియంట్ రూ. 69,999గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను వివో ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్కార్ట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో ప్రీ-ఆర్డర్ చేయవచ్చు.
ఇక లాంచ్ ఆఫర్ కింద రూ.5,000 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లేదా ఎక్స్‌చేంజ్ బోనస్ అందిస్తున్నారు. వీటితోపాటు 18 నెలల నో-కాస్ట్ EMI, 1 సంవత్సరం ఫ్రీ ఎక్స్‌టెండెడ్ వారంటీ, 18 నెలల ఫ్రీ జియో జెమినీ ప్రో ఆఫర్, V-Shield స్క్రీన్ ప్రొటెక్షన్‌పై 40% వరకు డిస్కౌంట్, 70% కచ్చితమైన బయ్ బ్యాక్ రూ. 599 వంటివి లభించనున్నాయి.
ASMR Unboxing: Vivo X200T
Take a look at what you get inside the box 👀#VivoX200T #VivoX200 #ASMRUnboxing #TechASMR #SmartphoneUnboxing pic.twitter.com/RIch3mzyx1— JagranHiTech (@jagranhitech) January 27, 2026
