Vivo WATCH GT 2 Launched: వివో (Vivo) భారత మార్కెట్లో తన స్మార్ట్‌వాచ్ పోర్ట్‌ఫోలియోలో భాగంగా.. Vivo X500 సిరీస్ స్మార్ట్‌ఫోన్లతో పాటు కొత్త Vivo WATCH GT 2 స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేసింది. ఆకర్షణీయమైన డిజైన్, AMOLED డిస్‌ప్లే, అధునాతన హెల్త్ మానిటరింగ్ ఫీచర్లు, 100కు పైగా స్పోర్ట్స్ మోడ్స్‌తో ఈ వాచ్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే బ్లూటూత్ కనెక్టివిటీతో గరిష్టంగా 25 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది.
ఈ స్మార్ట్‌వాచ్‌లో 2.07 అంగుళాల (5.26 సెం.మీ) AMOLED డిస్‌ప్లేను అందించారు. ఇది 60Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 2400 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్‌నెస్‌తో పనిచేస్తుంది.హై-గ్లోస్ బ్లాక్ అల్యూమినియం ఫినిషింగ్‌తో ప్రీమియం లుక్‌లో రూపొందించారు. ఈ వాచ్ అబ్సిడియన్ బ్లాక్, స్టెల్లార్ వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అలాగే 5ATM వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ కూడా ఉంది. వినియోగదారులు తమ అభిరుచికి అనుగుణంగా వాచ్ ఫేస్‌లను మార్చుకోవచ్చు. క్లాసిక్, బోల్డ్, ఇంటరాక్టివ్, డైనమిక్ వాచ్ ఫేస్‌లను అందించారు. అంతేకాకుండా వన్ క్లిక్ స్ట్రాప్ రిలీజ్ మెకానిజం ఉండటంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా స్ట్రాప్‌లను మార్చుకోవచ్చు.
ఇందులో బ్యాటరీ బ్యాకప్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. బ్లూటూత్ కనెక్టివిటీతో గరిష్టంగా 25 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. సాధారణ బ్లూటూత్ వినియోగంలో 14 రోజుల వరకు, బ్లూటూత్‌తో పాటు ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే (AOD) ఆన్‌లో ఉంటే 12 రోజుల వరకు బ్యాకప్ లభిస్తుంది. ఇందులో మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ డాక్‌ను అందించారు. ఛార్జింగ్ సమయంలో ఏవైనా అసాధారణ పరిస్థితులు ఎదురైతే ఆటోమేటిక్‌గా పవర్ కట్ అయ్యేలా మల్టిపుల్ సర్క్యూట్ సేఫ్టీ ప్రొటెక్షన్లు ఉన్నాయి.
Vivo WATCH GT 2 స్మార్ట్‌వాచ్ BlueOS 3.0 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌తో పాటు iOS కనెక్టివిటీకి కూడా సపోర్ట్ చేస్తుంది. ఐఫోన్ వినియోగదారులు నోటిఫికేషన్లు పొందడంతో పాటు హెల్త్ డేటాను సింక్ చేసుకోవచ్చు. రిమోట్ ఫోన్ కంట్రోల్ ఫీచర్ ద్వారా చేతికి ఉన్న వాచ్ నుంచే ఫోన్ స్క్రీన్‌ను నియంత్రించడంతో పాటు యాప్‌లలో స్క్రోల్ చేయవచ్చు. NFC యాక్సెస్ కార్డ్ ఫీచర్ ద్వారా ఎన్‌క్రిప్ట్ చేయని 13.56MHz ఆఫీస్, బిల్డింగ్ యాక్సెస్ కార్డులకు సపోర్ట్ లభిస్తుంది.
ఫిట్‌నెస్ ప్రియుల కోసం ఈ వాచ్‌లో 100కు పైగా స్పోర్ట్స్ మోడ్స్‌ను అందించారు. ఇండోర్, అవుట్‌డోర్, ట్రాక్, కార్డియో వర్కవుట్లను ట్రాక్ చేయవచ్చు. ముఖ్యంగా రన్నింగ్ కోసం ప్రత్యేకమైన ఫీచర్లు ఉన్నాయి. రన్నింగ్ కోర్సులు, పనితీరు విశ్లేషణ, రన్నింగ్ ఫారమ్‌కు సంబంధించిన పలు రకాల విశ్లేషణలను అందిస్తుంది. వీటి ద్వారా రన్నింగ్ సామర్థ్యాన్ని అంచనా వేయడంతో పాటు గాయాల ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. టెన్నిస్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ వంటి రాకెట్ స్పోర్ట్స్ కోసం ప్రత్యేకమైన అడ్వాన్స్‌డ్ అనాలిసిస్ ఫీచర్లు ఉన్నాయి. ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ (SpO₂) మానిటరింగ్ ఫీచర్లు ఉన్నాయి. ఇంకా స్లీప్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా నిద్ర సమయంలో శ్వాస రేటు, స్లీప్ SpO₂, హార్ట్ రేట్ వేరియబిలిటీ (HRV) వివరాలను రికార్డ్ చేస్తుంది.
భారత్‌లో Vivo WATCH GT 2 స్మార్ట్‌వాచ్ ధరను రూ.14,999గా నిర్ణయించారు. నవంబర్ 27 నుంచే ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 3 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. వివో అధికారిక ఆన్‌లైన్ స్టోర్ shop.vivo.com ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ వాచ్‌కు అదనంగా కొనుగోలు చేసుకునే స్ట్రాప్‌ల ధరలు ఇలా ఉన్నాయి. గ్రీన్ స్పోర్ట్ బ్యాండ్ రూ.1,999 కాగా, బ్రౌన్ లెదర్ బ్యాండ్ రూ.2,799 గా నిర్ణయించారు. Vivo WATCH GT 2 కొనుగోలుపై ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు.

