100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
- vivo WATCH 6 స్మార్ట్‌వాచ్‌ను వివో చైనాలో అధికారికంగా లాంచ్
- 1.47 అంగుళాల AMOLED డిస్ప్లే
- 100కు పైగా స్పోర్ట్స్, వర్కౌట్ మోడ్లు
- 21 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VIVO WATCH 6: వివో నుండి కొత్త వేరబుల్ సెగ్మెంట్లో వివో వాచ్ 6 (vivo WATCH 6) స్మార్ట్‌వాచ్‌ను కూడా లాంచ్ చేసింది. ఇది హెల్త్ ట్రాకింగ్, స్పోర్ట్స్ మోడ్లు, eSIM కాలింగ్, హై బ్రైట్నెస్ డిస్ప్లేతో ప్రీమియం వాచ్‌గా వచ్చింది. ఇందులో 1.47 అంగుళాల AMOLED స్క్రీన్‌ను అందించారు. ఇది 3500 nits పీక్ బ్రైట్నెస్, 60Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 85.8% స్క్రీన్-టు-బాడీ రేషియోతో అల్ట్రా-నారో బెజెల్స్ ఉన్నాయి. స్క్రీన్‌పై సాఫైర్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. టైటానియం వర్షన్, స్టెయిన్లెస్ స్టీల్ వేరియంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
100+ స్పోర్ట్స్ మోడ్లు
ఈ వాచ్‌లో 100కి పైగా వర్కౌట్ మోడ్లు ఉన్నాయి. డ్యూయల్-ఫ్రీక్వెన్సీ GNSS సపోర్ట్‌తో ప్రొఫెషనల్ ట్రాకింగ్ అందిస్తుంది. ఇందులో రన్నింగ్ కోచింగ్, AI పేసింగ్, సైక్లింగ్ డేటా ట్రాకింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ గైడెన్స్, 80+ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కోర్సులు, హెల్త్ ఫీచర్లు, 60 సెకన్లలో 14 హెల్త్ మెట్రిక్స్ చెక్, హార్ట్ రేట్, SpO2, HRV, స్లీప్ ట్రాకింగ్, స్ట్రెస్ మానిటరింగ్, AFib & పల్ప్ వేవ్ అనాలిసిస్, బ్లడ్ ప్రెజర్ రిస్క్ ఎవాల్యుయేషన్, eSIM + NFC సపోర్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. WATCH 6లో eSIM సపోర్ట్ ఉంది. దీంతో ఫోన్ లేకుండానే కాల్స్, మెసేజ్‌లు చేయవచ్చు. WeChat ఇంటిగ్రేషన్, NFC పేమెంట్స్ (Alipay, transit cards), కార్ కీలు సపోర్ట్ ఉన్నాయి.
Also Read
- 42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
- 50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
- 200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
- 144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
బ్యాటరీ లైఫ్
బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే.. ఇందులో లైట్ యూజ్‌లో గరిష్ఠంగా 21 రోజుల వరకు బ్యాకప్ అందిస్తుంది. రెగ్యులర్ యూజ్‌లో 10 రోజులు, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆన్‌లో ఉంటే 6 రోజులు, eSIM మోడ్‌లో 4 రోజుల వరకు పనిచేస్తుంది. వాచ్‌ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి సుమారు 2 గంటల సమయం పడుతుంది.
ధరలు
* బ్లూటూత్ వర్షన్: 999 యువాన్ (సుమారు రూ.14,295)
* eSIM (స్టీల్): 1399 యువాన్ (సుమారు రూ.20,020)
* eSIM (టైటానియం): 1999 యువాన్ (సుమారు రూ.28,605)
వివో బడ్స్ క్లిప్ ఇప్పటికే అందుబాటులోకి రాగా, vivo WATCH 6 సెప్టెంబర్ 28 నుంచి సేల్కు వస్తుంది.
తాజావార్తలు
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
India XI vs World XI: ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు.. ఫ్యాన్స్‌కు కేక పుట్టించే బిగ్ మ్యాచ్!
-
Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఇద్దరు నవజాత శిశువులు మృతి
ట్రెండింగ్
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!