NTV Telugu Site icon

Vivo V50: 6000mAh బ్యాటరీ, 50MP ZEISS కెమెరా.. లాంచ్ ఎప్పుడంటే..?

Vivo V50

Vivo V50

వివో (Vivo) ఎట్టకేలకు భారతదేశంలో తన కొత్త స్మార్ట్‌ఫోన్ వివో V50 యొక్క లాంచ్ తేదీని ప్రకటించింది. ఈ ఫోన్ 2025 ఫిబ్రవరి 18న భారతదేశంలో లాంచ్ అవుతుంది. ప్రస్తుతం వివో V50 Pro గురించి కంపెనీ ఎటువంటి అధికారిక సమాచారం పంచుకోలేదు. ఇది వివో V40 యొక్క అప్‌గ్రేడ్ వేరియంట్‌గా లాంచ్ అవుతుంది. వివో V50లో ZEISS కంపెనీ నుండి వచ్చే కెమెరా టెక్నాలజీ ఉంటుందని ఇప్పటికే ప్రకటించింది.

Read Also: India Alliance: ఢిల్లీ ఎన్నికల ఫలితాల తర్వాత.. ఇండియా కూటమి పరిస్థితి ఏంటి?

డిజైన్ & ఫీచర్లు:
వివో V50లో ఫోన్ డిజైన్, ఫీచర్లకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చాయి. వివో V50 కూడా తన మునుపటి V సిరీస్ ఫోన్‌ల మాదిరిగానే ఆకర్షణీయమైన డిజైన్, స్లిమ్ బాడీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌లో 6000mAh బ్యాటరీ ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఇది భారతదేశంలో అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్‌గా చెబుతున్నారు. మునుపటి వివో V40లో 5500mAh బ్యాటరీ ఉండేది. అలాగే.. 80W ఛార్జింగ్ వేగం సపోర్ట్ కూడా ఉంటుందని అంచనా.

కలర్ & డిస్‌ప్లే:
వివో V50 మూడు రంగులలో లాంచ్ అవుతుంది. రోజ్ రెడ్, స్టార్రి నైట్, టైటానియం గ్రే కలర్లు అందుబాటులో ఉండనున్నాయి. ఈ ఫోన్ డిస్‌ప్లే ముందు భాగంలో V40 లాంటి డిజైన్ కలిగి ఉంటుంది. డ్యూయల్‌ కర్వడ్‌ ఎడ్జ్ డిస్‌ప్లేకు బదులుగా.. క్వాడ్‌ కర్వడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే మెరుగైన అనుభూతిని అందిస్తుందని సంస్థ చెబుతోంది.

కెమెరా ఫీచర్లు:
వివో V50 కెమెరా సెట్‌లో వెనుక భాగంలో రెండు 50-మెగాపిక్సెల్ సెన్సార్లు ఉంటాయి. వీటి ప్రథమ సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో వస్తుంది. రెండవ సెన్సార్ అల్ట్రావైడ్, 119-డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ (FoV) కలిగి ఉంటుంది. అంతేకాకుండా.. 50MP ఫ్రంట్ కెమెరా ఆటో ఫోకస్‌ కూడా కలిగి ఉంటుంది. AI 3D స్టూడియో అల్గోరిథం, సిగ్నేచర్ ఆరా లైటింగ్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయని వివో తెలిపింది.

స్క్రీన్ & రేటింగ్స్:
వివో V50 లో ‘షీల్డ్ గ్లాస్’ ఉపయోగించారు.. ఇది స్క్రీన్ రక్షణను అందిస్తుంది. ఈ ఫోన్‌కు IP68 మరియు IP69 రేటింగ్స్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌‌గా ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 తో పనిచేస్తుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్‌ 3 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది.