50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivo TWS 5i Launched: వివో (Vivo) ఆడియో ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను పెంచుతూ కొత్త బడ్జెట్ ట్రూ వైర్లెస్ (TWS) ఇయర్‌బడ్‌లుగా Vivo TWS 5i ను చైనాలో లాంచ్ చేసింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న Vivo TWS 5 & Vivo TWS 5 Hi-Fi మోడళ్లకు ఇది అప్డేటెడ్. తక్కువ ధరలో మంచి సౌండ్ క్వాలిటీ, దీర్ఘకాలిక బ్యాటరీ లైఫ్, గేమింగ్‌కు తక్కువ లేటెన్సీ వంటి ఫీచర్లతో ఈ ఇయర్‌బడ్‌లు వినియోగదారుల ముందుకు వచ్చాయి.
ఫీచర్ల పరంగా చూస్తే Vivo TWS 5i లో 10mm డైనమిక్ డ్రైవర్‌తో పాటు PU + PEEK పాలిమర్ డయాఫ్రామ్ను ఉపయోగించారు. DeepX 3.0 స్టీరియో సౌండ్ అండ్ స్పేషియల్ ఆడియో సపోర్ట్‌తో వినియోగదారులకు థియేటర్, కాన్సర్ట్ హాల్, రికార్డింగ్ స్టూడియో వంటి విభిన్న లిసనింగ్ మోడ్లు అందుబాటులో ఉన్నాయి. AAC, SBC, LC3 ఆడియో కోడెక్‌లకు సపోర్ట్ ఉంది. బాస్, వాయిస్ క్లారిటీ, హైస్ అన్ని బ్యాలెన్స్‌గా వినిపించేలా ట్యూన్ చేశారు. కాకపోతే, ఈ ఇయర్‌బడ్‌లలో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) లేదు. కానీ AI ఆధారిత కాల్ నాయిస్ రిడక్షన్ & విండ్ నాయిస్ సప్రెషన్ వంటి ఫీచర్లు అందించారు, దీంతో కాల్ సమయంలో క్లియర్ వాయిస్ అనుభవం పొందవచ్చు.
Also Read
- 10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- 12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
- 120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
- Poco X8s: పోకో X8s లాంచ్.. 6,330mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కొత్త ఫోన్!
కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.4 సపోర్ట్‌తో పాటు డ్యూయల్ డివైస్ కనెక్టివిటీ కూడా ఉంది. ఒకేసారి రెండు డివైస్‌లకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. గేమింగ్ కోసం 42ms వరకు తక్కువ లేటెన్సీ మోడ్ అందుబాటులో ఉంది. ఇవి వివో, iQOO ఫోన్లలో BlueOS ఫీచర్లు పూర్తి స్థాయిలో పని చేస్తాయి. ఇందులో ఇన్స్టంట్ పేయరింగ్, కస్టమైజబుల్ పాప్-అప్ అనిమేషన్స్, రియల్-టైమ్ ట్రాన్స్లేషన్, ఇయర్‌బడ్ ట్రాకింగ్, AI వాయిస్ అలర్ట్స్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి.
బ్యాటరీ విషయానికి వస్తే.. ఒకసారి చార్జ్ చేస్తే 11.5 గంటల వరకు ప్లేబ్యాక్ లభిస్తుంది. చార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 50 గంటల వరకు బ్యాటరీ లైఫ్ అందుతుంది. కేవలం 10 నిమిషాల చార్జ్‌తోనే సుమారు 4 గంటలు 5 నిమిషాల వినికిడి సమయం లభిస్తుందని కంపెనీ చెబుతోంది. IP54 రేటింగ్‌తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంది. డిజైన్ పరంగా ప్రతి ఇయర్‌బడ్ బరువు సుమారు 4.2 గ్రాములు మాత్రమే. చార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం బరువు 42 గ్రాముల వరకు ఉంటుంది. తేలికగా కాంపాక్ట్‌గా ఉండే ఈ ఇయర్‌బడ్‌లు రోజువారీ వినియోగానికి అనుకూలంగా ఉంటాయి.
ధర విషయానికి వస్తే, చైనాలో Vivo TWS 5i ధర CNY 119 (రూ. 1,600)గా నిర్ణయించారు. ఈ ఇయర్‌బడ్‌లు వైట్ స్పేస్, ఇంక్ బ్లాక్, స్కై బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం వివో చైనా అధికారిక వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!