Vivo T5 Lite: వివో T5 లైట్ 44W 5G ఫోన్ రిలీజ్.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, MediaTek Dimensity 6300 ప్రాసెసర్
- వివో T5 లైట్ 44W 5G ఫోన్ రిలీజ్
- 6500mAh బ్యాటరీ
- 4GB + 128GB -రూ.19,999
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివో భారత మార్కెట్లో కొత్త బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ Vivo T5 Lite 44W 5Gను అధికారికంగా విడుదల చేసింది. ఎక్కువసేపు బ్యాటరీ బ్యాకప్, వేగవంతమైన ఛార్జింగ్, మెరుగైన పనితీరు కోరుకునే వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. 6500mAh భారీ బ్యాటరీ, 44W ఫ్లాష్ ఛార్జింగ్, MediaTek Dimensity 6300 చిప్సెట్, 120Hz డిస్ప్లేతో ఈ ఫోన్ బడ్జెట్ విభాగంలో మంచి ఎంపికగా నిలవనుంది.
120Hz డిస్ప్లే, ఆకర్షణీయమైన డిజైన్
Vivo T5 Lite 44W 5Gలో 6.74 అంగుళాల HD+ LCD డిస్ప్లేను అందించారు. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ తో పాటు 1200 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ ను అందిస్తుంది. అంతేకాకుండా, TÜV Rheinland Eye Protection సర్టిఫికేషన్ ఉండటంతో ఎక్కువసేపు ఫోన్ ఉపయోగించినా కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు MediaTek Dimensity 6300 5G చిప్సెట్ శక్తినిస్తుంది. దీనికి గరిష్టంగా 6GB LPDDR4X RAM, 256GB UFS 2.1 స్టోరేజ్ లభిస్తుంది. అలాగే Android 16 ఆధారిత OriginOS 6.0పై పనిచేస్తుంది.
Also Read
- రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
- Vivo Y32 5G Launched: వివో Y32 5G వచ్చేసింది.. 8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz డిస్ప్లే!
- మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
- 9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
ఫోన్లో అందుబాటులో ఉన్న AI ఫీచర్లు:
AI Creation
AI Caption
Private Space
ఇతర స్మార్ట్ AI టూల్స్
50MP కెమెరాతో ఫోటోగ్రఫీ
ఫోటోగ్రఫీ కోసం వెనుక భాగంలో 50MP ప్రైమరీ కెమెరా, 0.8MP సెకండరీ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 5MP ఫ్రంట్ కెమెరాను అందించారు. కెమెరాలో నైట్ మోడ్, పోర్ట్రెయిట్ మోడ్, AI కెమెరా ఫీచర్లు వంటి అనేక షూటింగ్ మోడ్లు ఉన్నాయి.
6500mAh భారీ బ్యాటరీ
Vivo T5 Lite 5Gలో 6500mAh బ్యాటరీను అందించారు. ఇది 44W FlashChargeకు సపోర్ట్ చేస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే రోజంతా లేదా అంతకంటే ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ అందేలా రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్లో పలు ఆధునిక ఫీచర్లు కూడా ఉన్నాయి. IP65 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్, SGS & మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ
సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, Bluetooth 5.4, Dual-band Wi-Fi, FM Radio, OTG సపోర్ట్, USB Type-C పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, ఫోన్ మందం 8.39mm, బరువు 209 గ్రాములు.
Vivo T5 Lite 44W 5G ధర
భారతదేశంలో ఈ ఫోన్ మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.
4GB + 128GB -రూ.19,999
6GB + 128GB -రూ.22,999
6GB + 256GB -రూ.25,999
ఈ స్మార్ట్‌ఫోన్ Wave Blue, Twilight Shadow రంగుల్లో లభిస్తుంది. Vivo T5 Lite 44W 5Gను Flipkart, Vivo అధికారిక వెబ్సైట్ ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.
లాంచ్ ఆఫర్లు
ప్రారంభ ఆఫర్లో భాగంగా Axis Bank, HDFC Bank, SBI క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి రూ.1,500 వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ ఫోన్ ప్రారంభ ప్రభావవంతమైన ధర రూ.18,499కు అందుబాటులో ఉంటుంది.
తాజావార్తలు
-
AP Govt: అసైన్డ్, ఇనాం, పట్టా భూముల రైతులకు ఊరట.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం..
-
Nagarjuna King 100: ఐకానిక్ జోడీ ఈజ్ బ్యాక్: కానీ ఈసారి ‘ప్రేమ’ లేదు!
-
China Space Plane: అంతరిక్షంలో చైనా రహస్య విమానం.. అమెరికా నిఘా నివేదికలో కీలక వివరాలు.!
-
Hyderabad Clean and Traffic-Free : హైదరాబాద్‌కు కొత్త టార్గెట్.. క్లీన్ అండ్ ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మార్పు
-
Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై కాసుల వర్షం.. దసరా ఉత్సవాల హుండీ ఆదాయం రూ.11.59 కోట్లు..
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!