Vivo T4 Pro: Vivo త్వరలోనే Vivo T4 Pro స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో లాంచ్ చేయనున్నట్లు అధికారికంగా ధృవీకరించింది. గురువారం కంపెనీ తన అధికారిక X హ్యాండిల్‌లో ఈ కొత్త T4 సిరీస్ ఫోన్‌కు సంబంధించిన మొదటి టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో ఫోన్ వెనుక భాగం డిజైన్, అలాగే అందుబాటుకు సంబంధించిన వివరాలు వెలుబడ్డాయి. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ ద్వారా విక్రయానికి రానుంది. ఇది గత సంవత్సరం విడుదలైన Vivo T3 ప్రో కు అప్డేటెడ్ గా మార్కెట్లోకి రానుంది. లీక్ అయిన సమాచారం ప్రకారం ఇది Snapdragon 7 Gen 4 చిప్‌సెట్‌తో, 50MP వెనుక కెమెరాతో రానుంది.
Ashok Chakra 24 Spokes: అశోక చక్రంలో ఉన్న 24 ఆకుల (గీతలు) అర్థం ఏంటో తెలుసా?
కంపెనీ ఇంకా ఖచ్చితమైన విడుదల తేదీని ప్రకటించకపోయినా, టీజర్ వీడియోలో ఫోన్ వెనుక భాగం కొంత భాగం కనిపించింది. ఇది గోల్డెన్ ఫినిష్‌తో, 3x పెరిస్కోప్ జూమ్ సపోర్ట్‌తో రానుంది. ఇందుకు సంబంధించి ఫ్లిప్ కార్ట్ (Flipkart) కూడా Vivo T4 Pro కోసం ఓ ప్రత్యేకమైన మైక్రోసైట్‌ను సిద్ధం చేసింది. “Coming Soon” ట్యాగ్‌తో ఈ పేజీ అందుబాటులో ఉంది.
Minister Anitha: రాజకీయం ఎలా చేయాలో కూడా తెలియని వ్యక్తి జగన్
ఇకపోతే ఈ మొబైల్ లో 6.78 ఇంచులు, 1.5K రిజల్యూషన్ డిస్ప్లే, Snapdragon 7 Gen 4 ప్రాసెసర్, 50MP Sony IMX882 సెన్సార్ కెమెరా, పిల్-షేప్ కెమెరా ఐలాండ్, “Tele Lens” లేబుల్, ఇంకా AI ఆధారిత ఫీచర్లు ఉండనున్నాయి. ఇకపోతే గత సంవత్సరం ఆగస్టు 2024లో Vivo T3 Pro 8GB + 128GB వెర్షన్ రూ.24,999 ధరతో విడుదలైంది. కాబట్టి కొత్త Vivo T4 Pro ధర భారత మార్కెట్‌లో రూ.30,000 లోపు ఉండే అవకాశం ఉంది.
