7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
vivo S2: ఆగస్టు 6న వివో (VIVIO) నుండి కొత్త vivo S2 స్మార్ట్‌ఫోన్ అధికారికంగా లాంచ్ కానుంది. లాంచ్‌కు ముందే కంపెనీ ఈ ఫోన్‌కు సంబంధించిన కీలక ఫీచర్లను వెల్లడించింది. స్లిమ్ డిజైన్, భారీ బ్యాటరీ, శక్తివంతమైన ప్రాసెసర్, AI ఫీచర్లతో ఈ ఫోన్ మిడ్-ప్రీమియం సెగ్మెంట్లో వినియోగదారుల ముందుకు వచ్చేస్తుంది.
కర్వ్డ్ AMOLED డిస్ప్లే:
వివో S2లో 6.83 అంగుళాల 3D Curved AMOLED డిస్ప్లేను అందించారు. ఇది 1.5K రిజల్యూషన్ తోపాటు 120Hz రిఫ్రెష్ రేట్ ను సపోర్ట్ చేస్తుంది. ఎడ్జ్-టు-ఎడ్జ్ వ్యూయింగ్ అనుభవాన్ని అందించే ఈ డిస్ప్లే వినోదం, గేమింగ్‌కు మరింత మెరుగైన అనుభూతిని ఇస్తుంది. కేవలం 7.99mm మందంతో రూపొందించిన ఈ ఫోన్ ప్రీమియం మెటాలిక్ ఫినిష్‌తో వస్తుంది. ఇది సిల్క్ వైట్, సఫైర్ బ్లూ, రీగల్ బ్రాంజ్ రంగుల్లో రానుంది.
Also Read
- ప్రీమియం ఫీచర్లు బడ్జెట్ ధరలో.. 50MP OIS కెమెరా, సూపర్ AMOLED డిస్ప్లేతో Samsung Galaxy F70 Pro 5G లాంచ్..!
- 8100mAh భారీ బ్యాటరీ, 108MP కెమెరా వంటి క్రేజీ ఫీచర్లతో Honor X7e Plus (4G) లాంచ్..!
- Honor Play 11 Pro: హానర్ ప్లే 11 ప్రో రిలీజ్.. 50MP కెమెరా, 7000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్
- New Smart Phone: 9020mAH బ్యాటర్, 12GB RAM, AMOLED డిస్ప్లే.. విడుదలకు ముందే లీకైన ఫీచర్స్..
సోనీ కెమెరా:
ఫోటోగ్రఫీ కోసం ఇందులో Sony IMX852 సెన్సార్‌తో కూడిన 50MP ప్రధాన కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. ముఖ్యంగా ముందు, వెనుక కెమెరాలతో 4K వీడియో రికార్డింగ్ చేయవచ్చు. అలాగే ఆరా లైట్ పోర్ట్రెయిట్, డ్యూయల్ వ్యూ వీడియో వంటి ఫీచర్లు కంటెంట్ క్రియేటర్లకు మరింత ఉపయోగపడతాయి.
టర్బో ప్రాసెసర్:
ఈ ఫోన్‌కు MediaTek Dimensity 7360-Turbo చిప్సెట్ శక్తినిస్తోంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రాసెసర్ AnTuTu బెంచ్‌మార్క్‌లో 9.7 లక్షల స్కోర్ సాధించింది. దీంతో గేమింగ్, మల్టీటాస్కింగ్, రోజువారీ వినియోగంలో మెరుగైన పనితీరు లభించనుంది.
భారీ బ్యాటరీ & AI ఫీచర్లు:
vivo S2లో 7050mAh భారీ బ్యాటరీను అందించారు. వీడియో స్ట్రీమింగ్, గేమింగ్, నావిగేషన్, వీడియో షూటింగ్ వంటి పనులను రోజంతా సులభంగా నిర్వహించేలా ఈ బ్యాటరీ సామర్థ్యం ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్ OriginOS 6పై పనిచేస్తుంది. ఇందులో పలు AI ఆధారిత ఫీచర్లను అందించారు. ఇందులో..
Shake and Share – డేటా, 4K వీడియోలను హై-స్పీడ్‌తో సులభంగా షేర్ చేసే ఫీచర్.
Circle to Search 2.0 – స్క్రీన్‌పై ఉన్న టెక్స్ట్ లేదా ఇమేజ్ను వెంటనే సెర్చ్ చేసే AI ఫీచర్.
vivo Office Kit – డాక్యుమెంట్లను సులభంగా వీక్షించడం, ఎడిట్ చేయడం కోసం రూపొందించిన టూల్.
AI Creation – AI సహాయంతో క్రియేటివ్ కంటెంట్‌ను వేగంగా రూపొందించే ఫీచర్.
AI Transcript Assist – ఆడియో లేదా మీటింగ్‌లను టెక్స్ట్‌గా ఆటోమేటిక్‌గా మార్చే AI ఫీచర్.
వంటి స్మార్ట్ టూల్స్ ఉన్నాయి. vivo S2 స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 6న అధికారికంగా లాంచ్ కానుంది. అదే రోజు ఈ ఫోన్ ధర, స్టోరేజ్ వేరియంట్లు, విక్రయాల వివరాలు వెల్లడించనుంది. భారీ బ్యాటరీ, కర్వ్డ్ AMOLED డిస్ప్లే, AI ఫీచర్లతో vivo S2 మిడ్-రేంజ్ సెగ్మెంట్లో గట్టి పోటీ ఇవ్వనుందని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!
-
Sai Krishna Custodial Death: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. సిట్ దర్యాప్తు ముమ్మరం!
-
Rakhi Sawant: నేను ముస్లింనో కాదో నిర్ణయించడానికి మీరెవరు?.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన రాఖీ సావంత్ ..
-
Team India-BCCI: టీమిండియాలో పెరుగుతున్న గాయాల బెడద.. బీసీసీఐ కీలక నిర్ణయం!
-
Karthi New Movie: కార్తికి మరో భారీ ప్రాజెక్ట్.. స్టార్ డైరెక్టర్‌తో ఫస్ట్ టైమ్ .. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా కొత్త సినిమా!
ట్రెండింగ్
-
Mushroom Onion Pakoda: ఈజీ స్నాక్ రెసిపీ..10 నిమిషాల్లో కరకరలాడే ‘మష్రూమ్ ఆనియన్ పకోడీ’.! చేసేయండి ఇలా..
-
Mumbai Indians Captain: ముగ్గురు దిగ్గజాల సపోర్ట్.. తెలుగు ఆటగాడికి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ!
-
ప్రీమియం ఫీచర్లు బడ్జెట్ ధరలో.. 50MP OIS కెమెరా, సూపర్ AMOLED డిస్ప్లేతో Samsung Galaxy F70 Pro 5G లాంచ్..!
-
Best Cricketing Brain: ఎంఎస్ ధోనీ కాదు, అతడే బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్.. ఆ టీమిండియా మాజీ స్టార్ ఎవరంటే?
-
Tata దూకుడు మాములుగా లేదుగా.. Nexon నుంచి ప్రీమియం Avinya X వరకు భారీ ప్లాన్..!