స్మార్ట్ ఫోన్ లవర్స్ కు మరో కొత్త మొబైల్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఫోన్ తయారీ కంపెనీ వివో తన కొత్త స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది. Vivo V50 పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. Vivo V50 మిడ్ రేంజ్ ఫోన్. దీనిలో ZEISS కో- కెమెరా టెక్నాలజీని అందించింది. ఈ ఫోన్‌తో పెళ్లి, పార్టీ ఫోటోలను క్లిక్ చేయవచ్చు.90w ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీ 6000mAh బ్యాటరీతో వస్తున్న అత్యంత సన్నని హ్యాండ్ సెట్ ఇదేనని వివో తెలిపింది. ఈ ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ధర:
వివో V50 8GB RAM + 128GB వేరియంట్ ప్రారంభ ధర రూ. 34,999. 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 36,999 కి అందుబాటులో ఉంది. 12GB + 512GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.40,999కి కొనుగోలు చేయవచ్చు. దీని ప్రీ-బుకింగ్ ప్రారంభమైంది. ఫస్ట్ సేల్ ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభమవుతుంది. బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం తక్షణ క్యాష్‌బ్యాక్ ఆఫర్ లభిస్తుంది.
Also Read:Hyderabad: ‘మీ ఆవిడని నాకిచ్చేయ్’.. ప్రియురాలి భర్తతో ప్రియుడు గొడవ
ఫీచర్లు:
వివో V50 లో 6.77-అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 4500nits పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం డైమండ్ షీల్డ్ గ్లాస్ అందించారు. భద్రత దృష్ట్యా, ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌లో Qualcomm Snapdragon 7 Gen 3 చిప్‌సెట్ అమర్చారు. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‌టచ్‌ఓఎస్ 15 పై పనిచేస్తుంది. Vivo V50 లో ZEISS కో- టెక్నాలజీ కెమెరా సిస్టమ్ అందించారు. వెనుక ప్యానెల్‌లో 50MP OIS కెమెరా ఉంది. దానితో పాటు 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా అందించారు. సెల్ఫీల కోసం ముందు భాగంలో 50MP AF సెన్సార్ ఉంది. AI ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇందులో సర్కిల్ టు సెర్చ్, వివో లైవ్ కాల్ ట్రాన్స్‌లేషన్, AI ట్రాన్స్‌క్రిప్ట్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.