NTV Telugu Site icon

Tardigrade: ఇది మృత్యుంజయురాలు..సూర్యుడు నాశనమయ్యే వరకు ఈ జీవికి మరణం లేదు!

Tardigrades

Tardigrades

భూమిపై పుట్టిన ప్రతి జీవి ఏదో ఒక రోజు చావాల్సిందే. పుట్టిన వారు మరణించక తప్పదు..మరణించిన వారు జన్మించక తప్పదని హిందువుల ఆరాధ్య గ్రంధం భగవద్గీత చెబుతోంది. ప్రతి మనిషికి మరణం ఎలా ఉంటుందో? ఇతర జీవులు కూడా ఏదోనాడు చావు తప్పదు. అయితే అవి కొన్ని ఎన్నేళ్ల వరకు బతికుంటాయనేది వాటి జీవనవిధానంపై ఆధారపడి ఉంటుంది. కానీ ఈ భూమిపై ఓ జీవికి మాత్రం చావు లేదు.
ఏదైనా ప్రళయం వచ్చినా.. మానవ జాతి భూమి నుంచి తుడిచిపెట్టుకుపోయినా కూడా ఈ అర మిల్లీమీటరు జీవి మాత్రం ఇక్కడ హాయిగా జీవించ గలదు. సూర్యుడు నాశనమయ్యే వరకు ఈ జీవికి మరణం లేదు. ఈ జంతువు ఆహారం, నీరు లేకుండా ఏకంగా 30 సంవత్సరాలు సుఖంగా జీవిస్తుంది.

READ MORE: Nizam College: అబిడ్స్ లో ఉద్రిక్తత.. విద్యార్థుల ఆందోళనతో భారీ ట్రాఫిక్‌ జామ్‌

సాధారణంగా ఉష్ణోగ్రత 50 దాటితేనే మనుషులు భరించలేరు. అలాంటిది 150 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కూడా ఈ జీవి దిట్టలా బతికే ఉంటుంది. ఇక మైనస్ -457 డిగ్రీల చలి ఉంటే.. ఎన్నో జీవులు ప్రాణాలు కోల్పోతాయి. మానవులు అస్సలు తట్టుకోలేరు. కానీ దీనికి మాత్రం చీమకుట్టినట్లు కడా అనిపించదు. ఇది పూర్తిగా చనిపోవాలి అంటే సూర్యుడు నాశనం అవ్వాలి. ఈ అద్భుతమైన జీవి పేరు “టార్డిగ్రేడ్”. తెలుగులో దీన్ని నీటి ఎలుగుబంటి అని పిలుస్తారు. ఈ జీవి ప్రపంచం అంతమయ్యే వరకు జీవిస్తుందని నిపుణులు చెబుతున్నారు. నీటి ఎలుగుబంటికి అంత శక్తి ఉందా అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ నీటి ఎలుగుబంటి పొడవు కేవలం 0.5 మిల్లీమీటర్లు మాత్రమే. ఇంత చిన్న పరిమాణంలో ఉన్న జీవిని మానవుడు కళ్లతో చూడలేడు.

READ MORE: Neeraj Chopra: రేపే క్వాలిఫికేషన్ రౌండ్‌.. ‘గోల్డ్’ ఆశలు నీరజ్‌ చోప్రా పైనే! భారత్ నుంచి మరో ప్లేయర్

మరుగుతున్న నీటిలో ఉడకబెట్టినా.. మంచులో గడ్డకట్టినా ఈ జీవి 200 సంవత్సరాలు జీవించగలదు. నిజానికి ఏదైనా గ్రహ శకలం భూమిని ఢీ కొడితే సర్వం నాశనం అవుతాయి. లేదా ఏదైనా నక్షత్రం పేలినప్పుడు గామ కిరణాలు విడుదలై భూమి మొత్తం తుడుచుపెట్టుకు పోతంది. అయితే అలాంటి సమయంలో కూడా నీటి ఎలుగుబంటి మాత్రమే మనుగడ సాగిస్తాయి. ఈ అద్భుతమైన జీవిని మృత్యుంజయురాలిగా అభివర్ణించవచ్చు.