Telegram: త్వరలో అదనపు ఫీచర్లు.. కానీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెలిగ్రామ్.. వాట్సాప్ తరహాలోనే సేవలు అందించే ఓ మెసేజింగ్ యాప్. ఇటీవలి కాలంలో ఈ యాప్ యూజర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వాట్సాప్‌లో లేని అద్భుతమైన ఫీచర్లు ఇందులో ఉండటం, ప్రైవేట్ సెక్యూరిటీ స్ట్రాంగ్‌గా ఉండడంతో.. యూజర్స్ దీనిని బాగా డౌన్‌లోడ్స్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే టెలిగ్రామ్ మరిన్ని ఫీచర్స్‌ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. కాకపోతే.. ఆ ఫీచర్స్ ఉచితంగా వినియోగించడానికి వీల్లేదు. డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ వెల్లడించాడు.
‘‘ప్రతి ఒక్కరికీ ఎలాంటి పరిమితులు లేకుండా అన్ని ఫీచర్లు వినియోగించుకోవడానికి అనుమతి ఇస్తే.. అప్పుడు మా సర్వర్లు, రద్దీ నిర్వహణకు అయ్యే ఖర్చులు భరించలేనంత పెరిగిపోతాయి. అందుకే, పెయిడ్ వర్షన్‌ని లాంచ్ చేస్తున్నాం. ఇందులో కొన్ని ఫీచర్స్‌ని డబ్బులు చెల్లించి, వినియోగించుకోవాల్సి ఉంటుంది’’ దురోవ్ తెలిపాడు. ఇప్పటివరకు ఉన్న సదుపాయాలను ఉచితంగా అందిస్తామని.. అదనంగా తీసుకొచ్చే కొత్త సదుపాయాలను మాత్రమే పెయిడ్ ఆప్షన్‌కు పరిమితం చేస్తామని స్పష్టం చేశాడు. ప్రతి నెలా నిర్ణీత చందా చెల్లించడం ద్వారా టెలిగ్రామ్ పెయిడ్ సేవలు పొందే వీలుంటుందని తెలిపాడు. ఈ నెల చివర్లో టెలిగ్రామ్ పెయిడ్ వెర్షన్ ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది.
Also Read
- Power Saving Tips: ఏసీ కాదు..కూలర్ కాదు.. మీ సీలింగ్ ఫ్యాన్‌తోనే కరెంట్ బిల్లు వాచిపోద్ది..ఎలాగంటే?
- Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
- ASUS T3201: 9,000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల OLED డిస్ప్లేతో.. ASUS కొత్త టాబ్లెట్ విడుదల
- Samsung: సామ్ సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8, ఫోల్డ్ 8 అల్ట్రా డిజైన్ లీక్.. 200MP కెమెరాతో రానున్నాయా?
తాజావార్తలు
-
Annamalai: అన్నామలై రాజీనామా చేయలేదా..?
-
4 Years of Vikram: లోకనాయకుడి ‘విక్రమ్’ కి నాలుగేళ్లు.. నేటికీ చెక్కు చెదరని ఎల్సీయూ (LCU) రికార్డ్స్!
-
Peddi: పెద్ది టార్గెట్ పెద్దదే.. కానీ?
-
Team India Series: భారీ సిరీస్‌కు సిద్ధంగా టీమిండియా.. అందరి దృష్టి ఈ లెజెండ్స్పైనే.. ఇదే లాస్ట్..
-
Dhanush Political Entry: విజయ్‌కు పోటీగా ధనుష్ పాలిటిక్స్ ఎంట్రీ?
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!