NTV Telugu Site icon

Telegram: త్వరలో అదనపు ఫీచర్లు.. కానీ!

Telegram Paid Version

Telegram Paid Version

టెలిగ్రామ్.. వాట్సాప్ తరహాలోనే సేవలు అందించే ఓ మెసేజింగ్ యాప్. ఇటీవలి కాలంలో ఈ యాప్ యూజర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వాట్సాప్‌లో లేని అద్భుతమైన ఫీచర్లు ఇందులో ఉండటం, ప్రైవేట్ సెక్యూరిటీ స్ట్రాంగ్‌గా ఉండడంతో.. యూజర్స్ దీనిని బాగా డౌన్‌లోడ్స్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే టెలిగ్రామ్ మరిన్ని ఫీచర్స్‌ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. కాకపోతే.. ఆ ఫీచర్స్ ఉచితంగా వినియోగించడానికి వీల్లేదు. డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ వెల్లడించాడు.

‘‘ప్రతి ఒక్కరికీ ఎలాంటి పరిమితులు లేకుండా అన్ని ఫీచర్లు వినియోగించుకోవడానికి అనుమతి ఇస్తే.. అప్పుడు మా సర్వర్లు, రద్దీ నిర్వహణకు అయ్యే ఖర్చులు భరించలేనంత పెరిగిపోతాయి. అందుకే, పెయిడ్ వర్షన్‌ని లాంచ్ చేస్తున్నాం. ఇందులో కొన్ని ఫీచర్స్‌ని డబ్బులు చెల్లించి, వినియోగించుకోవాల్సి ఉంటుంది’’ దురోవ్ తెలిపాడు. ఇప్పటివరకు ఉన్న సదుపాయాలను ఉచితంగా అందిస్తామని.. అదనంగా తీసుకొచ్చే కొత్త సదుపాయాలను మాత్రమే పెయిడ్ ఆప్షన్‌కు పరిమితం చేస్తామని స్పష్టం చేశాడు. ప్రతి నెలా నిర్ణీత చందా చెల్లించడం ద్వారా టెలిగ్రామ్ పెయిడ్ సేవలు పొందే వీలుంటుందని తెలిపాడు. ఈ నెల చివర్లో టెలిగ్రామ్ పెయిడ్ వెర్షన్ ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది.