6000mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌, 50MP సోనీ కెమెరాతో TECNO SPARK 50 Pro లాంచ్.!

Tecno Spark 50 Pro

Tecno Spark 50 Pro

TECNO SPARK 50 Pro Launched:టెక్నో (TECNO) నుండి స్పార్క్ (SPARK) సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్ TECNO SPARK 50 Proను గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ అయ్యింది. దీర్ఘకాలిక బ్యాటరీ, బలమైన నిర్మాణం, AI ఫీచర్లు, మెరుగైన కెమెరా సామర్థ్యాలతో వంటి బెస్ట్ ఫీచర్స్ తో ఈ మొబైల్ వినియోగదారుల ముందుకు వచ్చింది. మరి ఆ వివరాలేంటో ఓ సారి చూసేద్దామా..

ఆరు సంవత్సరాల వరకు మన్నికైన బ్యాటరీ:

TECNO SPARK 50 Pro రెండు బ్యాటరీ వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. ఒక మోడల్‌లో 5,600mAh డ్యూయల్-సెల్ బ్యాటరీ, మరో మోడల్‌లో 6,000mAh సింగిల్-సెల్ బ్యాటరీని అందించారు. కంపెనీ ప్రకారం ఈ బ్యాటరీలు 1,900కు పైగా ఛార్జింగ్ సైకిళ్లను తట్టుకుని, సుమారు ఆరు సంవత్సరాల వరకు 80% సామర్థ్యాన్ని నిలుపుకుంటాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 60W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. కేవలం 30 నిమిషాల్లో 63% వరకు ఛార్జ్ అవుతుండగా, పూర్తి ఛార్జ్ కావడానికి సుమారు 55 నిమిషాలు పడుతుంది. అంతేకాదు ఇందులో హైపర్ మోడ్, స్మార్ట్ మోడ్, లో-టెంపరేచర్ మోడ్ అనే మూడు ప్రత్యేక ఛార్జింగ్ మోడ్‌ లను కూడా కంపెనీ అందించింది.

×
×
Ad

ప్రాసెసర్:

పనితీరు కోసం ఈ స్మార్ట్ ఫోన్ లో MediaTek Helio G100 Ultimate అనే చిప్‌సెట్‌ను ఉంచారు. AnTuTu బెంచ్‌మార్క్‌లో 5.5 లక్షల స్కోర్ సాధించే సామర్థ్యం దీనికి ఉంది. Memory Fusion 4.0 టెక్నాలజీ ద్వారా మొత్తం 24GB వరకు డైనమిక్ RAM విస్తరణకు మద్దతు లభిస్తుంది.

120Hz డిస్‌ప్లే:

ఈ కొత్త స్మార్ట్ ఫోన్ లో 6.78 అంగుళాల HD+ డిస్‌ప్లేను అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో స్క్రోలింగ్, గేమింగ్ మరింత స్మూత్‌గా ఉంటుంది. DTS సౌండ్ ట్యూనింగ్‌తో ఉన్న డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మెరుగైన ఆడియో అనుభూతిని అందిస్తాయి.

50MP సోనీ కెమెరా:

ఫోన్‌లో Sony LYTIA 600 సెన్సార్ ఆధారిత 50MP ప్రధాన కెమెరాను అమర్చారు. తక్కువ వెలుతురులో కూడా స్పష్టమైన చిత్రాలను అందించేలా ఈ సెన్సార్ రూపొందించబడింది. FlashSnap టెక్నాలజీ ద్వారా 1/10,000 సెకన్ల వరకు షట్టర్ స్పీడ్ లభించడంతో వేగంగా కదిలే వస్తువులను కూడా స్పష్టంగా చిత్రీకరించవచ్చు. ఇంకా ఈ ఫోన్‌లో Live Photo, AI Eraser 2.0, AI Extender, Universal Tone వంటి ఆధునిక AI ఫీచర్లు ఉన్నాయి. ఫోటోలలో అనవసర వస్తువులను తొలగించడం, ఫ్రేమ్‌ను విస్తరించడం, చర్మ వర్ణాలను సహజంగా చూపించడం వంటి పనులను ఇవి సులభతరం చేస్తాయి.

IP68, IP69 రేటింగ్స్:

భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఈ ఫోన్ కేవలం 7.8 మిల్లీమీటర్ల మందంతో స్లిమ్ డిజైన్‌ను కలిగి ఉంది. Swiss SGS ఫైవ్-స్టార్ ప్రీమియం డ్రాప్ రెసిస్టన్స్ సర్టిఫికేషన్‌తో పాటు IP68, IP69 రేటింగ్‌లను కూడా పొందింది. దీంతో ధూళి, నీరు, అధిక పీడనంతో వచ్చే నీటి జెట్‌ల నుంచి కూడా ఫోన్‌కు రక్షణ లభిస్తుంది.

ధర:

TECNO SPARK 50 Pro ఇన్క్ బ్లాక్, టైటానియం గ్రే, మిడ్ నైట్ బ్లూ, డైనమిక్ ఆరంజ్, క్లౌడ్ వైట్ రంగుల్లో అందుబాటులోకి రానుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ధర, అమ్మకాల ప్రారంభ తేదీలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.